టెస్టు మ్యాచుల్లో బజ్ బాల్ ట్రెండ్..

-

సాధారణంగా టెస్టు మ్యాచ్ లో రోజు 90 ఓవర్లు ఆడతారు. నిదానంగా ఆడటం టెస్టు మ్యాచ్ ప్రత్యేకత. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ లో  బజ్ బాల్ విధానంతో ఆడటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రికెట్ పండితులు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ ఆడుతోంది.

అసలు బజ్ బాల్ అంటే ఏమిటీ .. టెస్టు మ్యాచ్ లో కూడా వన్డే, టీ20 తరహా బ్యాటింగ్ చేసి వెంటనే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు దించి వారిని ఒత్తిడిలోకి నెట్టేయడం. అసలైతే టెస్టుల్లో మెల్లిగా ఆడి రోజంతా బ్యాటింగ్ చేయాలి. లేదా రెండు రోజులు చేసినా అడిగే వారు ఉండరు. కానీ బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో కేవలం 78 ఓవర్లలోనే 398/8 చేసి మొదటి రోజే ఇంగ్లాండ్ డిక్లేర్డ్ చేసింది. ఈ విధానాన్ని కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.

క్రీడాకారుల అసలైన ఆటతీరు టెస్టు క్రికెట్ లోనే తెలుస్తోంది. దీనికి విభిన్నంగా ఆడటం అనేది సరైనది కాదని మాజీ క్రికెటర్ల అభిప్రాయం. టెస్టు క్రికెట్ లో కఠినంగా ఉండే పిచ్ లపై ఇలా ఆడటం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. దీనికంతటికి కారణం న్యూజిలాండ్ మాజీ డాషింగ్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ మెక్ కల్లమ్. ప్రస్తుతం ఈయన ఇంగ్లండ్ టెస్టు టీమ్ కు హెడ్ కోచ్ గా ఉన్నారు.

బ్రెండన్ మెక్ కల్లమ్ న్యూజిలాండ్ తరఫున వన్డేలు , టెస్టుల్లో ఇదే తరహా దూకుడుతో ఆడేవాడు. ఐపీఎల్ లో కూడా మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా ఇతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దూకుడు ఆటతీరుకు మెక్ కల్లమ్ పెట్టింది పేరు. ఇంత చేసినా మొదటి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఎనిమిది వికెట్లు పడిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుత పోరాటం చేసి నాథన్ లాయన్ తో మెరుగైన పార్టనర్ షిప్ నెలకొల్పి ఆసీస్ కు మధురమైన విజయాన్ని అందించారు. అయితే ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఓడిపోయిన పర్లేదు కానీ బజ్ బాల్ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news