ప్రస్తుతం దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీకి చెందిన వారికో లేదా తమకు ఇష్టం ఉన్నవారికో భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎప్పటికప్పుడు భారతరత్న ఫలానా వారికి ఇవ్వాలని కోరే వారి డిమాండ్ పెరిగిపోతోంది.
దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు సిఫారసు చేసే అధికారం కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా ప్రధాని పంపిన జాబితాను రాష్ట్రపతి ఫైనల్ చేసి ఓకే చేస్తారు. అయితే సాధారణంగా ప్రధాని సూచించిన పేర్లను రాష్ట్రపతి తిరస్కరించడం చాలా అరుదు. ఈ క్రమంలో ప్రధాని ఇచ్చే భారతరత్న పురస్కారాల సిఫారసు లిస్టే దాదాపుగా ఫైనల్ అవుతూ ఉంటుంది. అయితే దేశంలో ఎప్పటికప్పుడు భారతరత్న ఫలానా వారికి ఇవ్వాలని కోరే వారి డిమాండ్ పెరిగిపోతోంది.
ప్రస్తుతం దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీకి చెందిన వారికో లేదా తమకు ఇష్టం ఉన్నవారికో భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2008 జనవరిలో బీజేపీ అగ్రనాయకుడు ఎల్‌కే అద్వానీ మాజీ ప్రధాని వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలని అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. అలాగే సీపీఐ (ఎం) తమ నాయకుడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ ఆ పురస్కారానికి తాను అర్హున్ని కాదని జ్యోతి బసు అప్పట్లో అన్నారు. ఇక బీఎస్పీ తమ పార్టీ నేత కాన్షీరాంకు, శిరోమణి అకాలీదళ్ తమ పార్టీ నేత ప్రకాష్ సింగ్ బాదల్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
2015 సెప్టెంబర్‌లో శివసేన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే అప్పట్లో ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు సమైక్యాంధ్రకు సీఎంగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా ఆయన డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పటి వరకు భారతరత్న పొందిన వారి జాబితాను ఒకసారి పరిశీలిస్తే మాత్రం అందులో కచ్చితంగా ఎన్‌టీఆర్ పేరు లేదనే తెలుగు వారికి బాధ కలుగుతుంది. నిజానికి ఎన్‌టీఆర్ భారతరత్నకు అర్హులు. కళారంగానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ప్రజలకు ఎన్‌టీఆర్ ఎంతో సేవ చేసినా.. ఆయనకు ఇప్పటికీ భారతరత్న రాలేదు. మరి ముందు ముందు ఆయనకు భారతరత్న పురస్కారం ఇస్తారో లేదో చూడాలి..!