తమన్నా సింహాద్రి పేరుతో.. హీరోయిన్ తమన్నాకు కొత్త కష్టాలు..!

-

తమన్నా సింహాద్రి ట్రాన్స్‌జెండర్.. కానీ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా కూడా ఉంది. దీంతో హీరోయిన్ తమన్నాను తమన్నా సింహాద్రి అనుకుని చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ప్రవర్తన వల్ల హౌస్‌లో ఉన్న ఇతర సభ్యులు విసిగిపోతున్నట్లు మనకు షో చూస్తేనే తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ కూడా తమన్నా సింహాద్రి ప్రవర్తనపై షాక్ అవుతున్నారు. దీంతో వారు ఆమె మీద ఉన్న కోపంతో సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అక్కడే ఇబ్బందంతా ఎదురవుతోంది.

తమన్నా సింహాద్రి ట్రాన్స్‌జెండర్.. కానీ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా కూడా ఉంది. దీంతో హీరోయిన్ తమన్నాను తమన్నా సింహాద్రి అనుకుని చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తమన్నా సింహాద్రికి అకౌంట్లు లేవు. దీంతో హీరోయిన్ తమన్నా అకౌంట్లనే వారు తమన్నా సింహాద్రి అకౌంట్లని భావిస్తున్నారట. ఈ క్రమంలో హీరోయిన్ తమన్నా సోషల్ మీడియా అకౌంట్లను చాలా మంది ట్యాగ్ చేస్తూ ఆమెను విమర్శిస్తున్నారట.

actress tamanna new problems with transgender tamanna simhadri

అయితే తమన్నా సింహాద్రి పేరు విషయంలో నెటిజన్లు అలా పొరపాటు పడుతుండడంతో హీరోయిన్ తమన్నా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుందట. ఆమె సోషల్ మీడియా ఖాతాలో నోటిఫికేషన్లు నిండిపోతున్నాయట. కానీ చాలా మందికి తమన్నా సింహాద్రికి సోషల్ మీడియాలో అకౌంట్లు లేవనే సంగతి తెలియదు. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా హీరోయిన్ తమన్నా పరిస్థితి తయారైందట. ఈ క్రమంలో హీరోయిన్ తమన్నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్‌బాస్ షో అయిపోయే వరకు లేదా తమన్నా సింహాద్రి ఎలిమినేట్ వరకు హీరోయిన్ తమన్నాకు ఈ గోస తప్పదని పలువురు అంటున్నారు. మరి అప్పటి వరకు హీరోయిన్ తమన్నా చూస్తూ ఊరుకుంటుందా.. లేదా.. చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news