ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నవన్నీ పూర్తి!.. ఆగస్టు 6 మంగళవారం- రోజువారి రాశిఫలాలు

-

మేషరాశి:తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. మీ కృషి ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపిస్తారు.
పరిహారాలు: శివలింగానికి జలాభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వృషభరాశి:ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు.విధేయతగల మనసు, ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది.
పరిహారాలు: ఆర్ధికంగా బలహీనమైన వారికి ఆకుపచ్చ వస్ర్తాలను దానం చేయడం ద్వారా జీవితం మరింత మెరుగుపడుతుంది.

మిథునరాశి:చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి. అనవసరమైన తగువులకి చోటివ్వకండి, దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించ డానికి ప్రయత్నించండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
పరిహారాలు: ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది

కర్కాటకరాశి:మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు తుడవబడతాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్‌కి కట్టుబడి ఉండండి. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. ఈ రోజు వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.
పరిహారాలు: వినాయకుడిని ఆరాధించడం ద్వారా ఆర్ధిక జీవితం బాగా ఉంటుంది.

సింహరాశి:మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్‌లో ఉంటారు, కానీ మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు.  మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం, మీ కుటుంబసమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి, సహాయపడగలవు. మీనిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. మీ బెటర్‌ హాఫ్‌తో సరదాగా గడిపేందుకు ఇది చక్కని రోజు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు, దీపారాధన చేయండి.

కన్యారాశి:మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమయితే అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ రోజు దూరప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్‌ చేసి సంప్రదిస్తారు. మీ సంభాషణలో సహజంగా ఉండండి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్‌ విషయాలు మాట్లాడుకుంటారు.
పరిహారాలు: కుటుంబ జీవితంలో శ్రేయస్సు పొందటానికి శివారాధన చేయండి.

తులారాశి:ఆరోగ్య విషయాలకి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం చూపకుండా, జాగ్రత్త వహించండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిచగలదు. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. మీ స్వీట్‌ హార్ట్‌ యొక్క పరుషమైన మాటలవలన మీమనసు కలత చెంది ఉండవచ్చు. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్‌ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె/అతను మీతో గొడవ పడతారు.
పరిహారాలు: సాయంత్రం వేళలో దేవాలయంలో దీపారాధన చేసే చక్కటి ఫలితాలు వస్తాయి.

వృశ్చికరాశి:ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. పొరుగువారితో తగాదా మీమనసుని పాడుచేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చెయ్యండి. మీ సిన్సియారిటీ మీకు ముందుకు పోవడంలో సహాయపడుతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్‌లో ఉంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమకోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.
పరిహారాలు: వ్యాధులు, లోపాలను వదిలించుకోవడానికి 15 – 20 నిముషాలు (ఉదయాన్నే) రోజూ సూర్యకాంతిలో నమస్కారాలు చేసుకోండి.

ధనస్సురాశి:దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్‌ మరియు మ్యూచ్యువల్‌ ఫ్‌ండ ల లో మదుపు చెయ్యాలి. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. పోటీపరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష భయం మిమ్మల్ని ఆవరించ నివ్వకండి. మీ పరిశ్రమ, కష్టం, రాణింపుకి వస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. గ్రోసరీ షాపింగ్‌ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనుకావచ్చు.
పరిహారాలు: యోగా, ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి దీనివల్ల కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి.

మకరరాశి:ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందగలరు. మీ విలువైన కాలాన్ని మీపిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్‌ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజనకరమే. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం!
పరిహారాలు: నవగ్రహాలకు దగ్గర కందులు, ఎర్రపూల ఉంచి ప్రదక్షిణలు చేయండి తప్పక మంచి జరుగుతుంది.

కుంభరాశి:మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చెయ్యండి. అది మీకు, మీకుటుంబానికి అమితమైన సుఖసంతోషాలను కలిగిస్తుంది. పొగత్రాగడం మానండి. ఎందుకంటే, అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపడుతుంది. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. మీ కృషి ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్‌ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్‌ చేస్తుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధనతోపాటు సుబ్రమణ్యస్వామికి పూజచేసుకోండి లేదా స్తోత్రాలు చదవండి.

మీనరాశి:మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనీయకండి. గ్రహచలనం రీత్యా, అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు  కనిపిస్తున్నాయి. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి. మీపనులను ఇతరులతో చేయించకండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. అపార్థాల మయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.
పరిహారాలు:గొప్ప ఆరోగ్య, కుటుంబ జీవితం కోసం మీ ఉదరం తాకేలా బంగారు గొలుసు ధరించాలి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news