బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేయనున్న యాంకర్ రష్మీ

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలోనే రానుంది. ఈ క్రమంలో ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ సరికొత్త సీజన్ లో జబర్దస్త్ యాంకర్ రష్మీ పాల్గొనబోతోందట. కొంతకాలంగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

 

టీవీ యాంకర్ గా కొన్నేళ్ల నుంచి బుల్లితెరను ఏలుతూ.. మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై కనువిందు చేస్తోంది రష్మీ. ఈ బ్యూటీకి చాలా ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ భామకున్న క్రేజ్ ఎక్కువే. ఇక ఈ భామకు మూగజంతువులంటే ఎంతో ప్రాణం. రష్మీలోని ఈ క్వాలిటీ అంటే కుర్రాళ్లకు చచ్చేంత ఇష్టం.

అయితే బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రష్మీ ఆ షోలో పాల్గొంటుందనే వార్తలొస్తూనే ఉన్నాయి. కానీ ఆరు సీజన్లలో అది నిజం కాలేదు. కానీ ఈ ఏడో సీజన్ లో మాత్రం రష్మీ తప్పకుండా పాల్గొంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రష్మీ అభిమానులకు పండగే.

Read more RELATED
Recommended to you

Exit mobile version