బిగ్‌బాస్‌: అంద‌రి మ‌న‌స్సులు గెలిచిన కంటెస్టెంట్ ఎవ‌రంటే..

-

బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకోవ‌డంతో షో మ‌రింత ర‌క్తిక‌డుతోంది. గత కొన్ని ఎపిసోడ్స్ నుండి బిగ్ బాస్ లో ఎమోషనల్ సన్నివేశాలకు తెరలేపారు. ఇప్ప‌టికే మూడు నెల‌లుగా కంటెస్టెంట్ల‌కు, ఇంటి స‌భ్య‌లతో పాటు స‌మాజంలో బంధాలు, అనుబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బ‌య‌ట ప్ర‌పంచానికి ఇన్ని రోజులు దూరంగా ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందుకే వారికి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ వాళ్ల కుటుంబ స‌భ్యుల‌ను హౌస్‌లోకి పంపాడు.

చాలా రోజుల త‌ర్వాత కుటుంబ స‌భ్యుల‌ను చూసిన వారంతా ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్‌కు గుర‌య్యారు. ముందుగా వితిక చెల్లి రితిక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి వితిక బోరున ఏడ్చేసింది. ఆమె త‌న బావ వ‌రుణ్‌ను వాటేసుకుంది. అలీ రెజా భార్య మ‌సుమ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్లీప్ మోడ్‌లో ఉన్న ఆలీకి కిస్సుల మీద కిస్సులు పెట్టేసింది. ఆలీని హ‌త్తుకుని త‌న ప్రేమంతా కురింపించేసింది.

ఇక ఆ త‌ర్వాత బాబా భాస్కర్ పిల్లలు రావడం జరిగింది. ఇక ఈ ఎమోష‌న‌ల్ ఎపిసోడ్స్ విష‌యానికి వ‌స్తే ఆయా కంటెస్టెంట్లు చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ కోసం ఆర్టిఫిషియ‌ల్‌గా కూడా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వితిక, అలీ రెజాలతో పోల్చితే బాబా భాస్క‌ర్‌, శివ‌జ్యోతి ఈ ఎమోషనల్ ఎపిసోడ్స్ లో ఎక్కువ మార్క్స్ కొట్టేశారని తెలుస్తుంది.

ఇక శివజ్యోతి హౌస్‌లో ఎప్పుడైనా ఎమోష‌న‌ల్గానే ఉంటుంది. ఆమె అటు బంధాల‌తో పాటు గేమ్‌లోనూ నూటికి నూరు శాతం పెర్పామ్ చేసేందుకు క‌ష్ట‌ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఎమోష‌న‌ల్‌గా చూస్తే శివ‌జ్యోతి, బాబా భాస్క‌ర్ పెర్పామెన్స్ మాత్రం ఆక‌ట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version