స‌స్పెన్స్ వీడింది… రాహుల్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌… నో చెప్పేసిన పున‌ర్న‌వి

-

తెలుగు పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 3 విన్న‌ర్‌గా రాహుల్ సిప్లింగంజ్ ప్ర‌స్తుతం తెలుగు మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. బిగ్‌బాస్ షోలో రాహుల్ గెలుపు వెన‌క ఎన్ని కార‌ణ‌లు ఉన్నా పున‌ర్న‌వితో అత‌డు ఆడిన ప్రేమాయ‌ణం (బిగ్‌బాస్ హౌస్ వ‌ర‌కు మాత్ర‌మే సుమా) కూడా ఎంతో కొంత ప్ల‌స్ అయ్యింద‌నే చెప్పాలి.

హౌస్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన కెమిస్ట్రీని అటు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు కూడా బాగా వాడుకున్నారు. చివ‌ర‌కు హెస్ట్ నాగార్జున సైతం పున‌ర్న‌విని మాట‌మాట‌కు కెలుకుతూ రాహుల్ పేరు ఎత్తుతూ చాలా స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించేవాడు. ఇక ఇప్పుడు హౌస్ నుంచి రాహుల్ బ‌య‌ట‌కు వ‌చ్చాక రాహుల్ లైఫ్ గురించి ఒక్కో ర‌హ‌స్యం బ‌య‌ట‌కు వ‌స్తోంది.

జాగా రాహుల్ పున‌ర్న‌వికి ఇచ్చిన పార్టీలో రాహుల్ త‌ల్లిదండ్రులు వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటామంటే తాము అభ్యంత‌రం చెప్ప‌మ‌న‌డంతో నిజంగానే పెళ్లి చేసుకుంటారా ? అన్న డౌట్లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్ద‌రు తాము జ‌స్ట్ ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెప్పేశారు. రాహుల్‌ సోదరుడు నిఖిల్ కిరణ్ మాత్రం బాంబు లాంటి వార్త పేల్చేశాడు.

రాహుల్‌కి అందరి లాగానే కాలేజీ బయట క్రష్ ఉందని, గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేశాడు. ఇక పున‌ర్న‌వి కూడా హౌస్‌లో ఉన్న‌ప్పుడు తాను ఓ వ్య‌క్తితో డేటింగ్‌లో ఉన్నాన‌న్న విష‌యం చెప్పింది. అందుకే రాహుల్‌కు నో చెప్పేసింద‌ట‌. దీనిని బ‌ట్టి వీరిద్ద‌రు జ‌స్ట్ ఫ్రెండ్స్ మాత్ర‌మే అన్న‌ది స్ప‌ష్టంగా క్లారిటీ వ‌చ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version