BIG BOSS 6 : ఫస్ట్ వీకే ఎలిమినేట్ కానున్న టాప్ కంటెస్టెంట్..!

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రానే వచ్చింది. అప్పుడే ఫస్ట్ ఎలిమినేషన్ కూడా వచ్చేసింది. ఇవాళ జరగనున్న ఎలిమినేషన్ లో మొదటి వారానికే బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లేది ఎవరని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ టాప్ కంటెస్టెంటే ఇవాళ హౌజ్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్..

బిగ్ బాస్ తెలుగు 6 మొదటి వీకెండ్ వచ్చేసింది. ఇవాల కాస్త ఫన్ కాస్త టెన్షన్ తప్పదు మరి. ఎందుకంటే ఇవాళ ఎవరు హౌజ్ లో ఉంటారో ఎవరు హౌజ్ ను వీడి వెళ్తారనేదానిపై ఓ క్లారిటీ వస్తుంది. ఈ వారం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆదివారం ఈ ఏడుగురు సభ్యుల్లో ఒకరు బయటికి వెళ్లనున్నారు.

ఆరోహి రావు, ఫైమా, సింగర్ రేవంత్, అభినయశ్రీ, ఇనయ సుల్తానా, చలాకీ చంటి, శ్రీ సత్య ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. సింగర్ రేవంత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అతడికి బయట చాలా ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ లలో తనే టాప్ సెలెబ్రిటీ. చలాకీ చంటి, ఫైమా జబర్దస్త్ కమెడియన్స్ గా ప్రేక్షకులకు  బాగా పరిచయం. అందులోనూ ఫైమా వయసులో చిన్నదైనా గమ్ముగా ఉండకుండా తన గేమ్ మొదలుపెట్టింది.

బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీస్ ఎప్పుడూ ఇంట్రెస్టే. అవి నిజమైనా కాకపోయినా ప్రేక్షకులను మాత్రం అలరిస్తాయి. ఆరోహి రావు కూడా అదే ట్రై చేస్తోంది. ప్రేమకథలు అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. శుక్రవారం వరకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఇనాయ, అభినయ శ్రీ డేంజర్ జోన్ లో ఉన్నారట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ కావచ్చంటే అభినయశ్రీ పేరు వినిపిస్తుంది.

ఇనాయా కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. ఒకటి రెండు టాస్కుల్లో కూడా పాల్గొంది. కానీ అభినయశ్రీ అలా కాదు. ఇప్పటి వరకు ఆమె మౌనంగానే ఉంది. అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్లుగా ఉంది. బిగ్ బాస్ కెమెరాలు కూడా అభినయను ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు. అందుకే ఈ వారం ఎలిమినేట్ అయ్యే వారి పేర్లలో అభినయశ్రీ పేరే గట్టిగా వినిపిస్తోంది. ఇంకొన్ని గంటల్లో బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు ఉంటారో.. ఎవరి ఎలిమినేట్ అవుతారో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version