తెలుగు బిగ్ బాస్ ఐదోవారంలోకి అడుపెట్టింది. హౌస్‌లో ఇప్పుడిప్పుడే కాస్త ప్రేమలు, ఏడుపులు, యుద్ధాలు, ఒకరిపై మరొకరు మాటలు చెప్పుకోవడాలు ఎక్కువ అయ్యాయి. ఇక అన్నీ ఎమోషన్లు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఓ వైపు ఫైటింగులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. హిమజ ఫస్ట్రేషన్ లో ఇంట్లోని గుడ్లు అన్నీ పగులకొట్టడంతో హౌస్‌లో నానా రచ్చ జరిగింది.
ఇప్పుడు నైట్ 9 అయితే చాలు ప్రతి ఇంట్లో బిగ్‌బాస్ చర్చే నడుస్తోంది. నైట్ ఈ షో చూడని వాళ్లు పగటి పూట మరోసారి చూస్తున్నారు. కొందరు హాట్‌స్టార్లో చూస్తున్నారు. మహిళలు, యువత, మధ్య వయస్కులు ఇలా అన్ని వర్గాల వారు బిగ్‌బాస్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. వీకెండ్ వచ్చిందంటే చాలు నాగార్జున షోను తన హోస్టింగ్‌తో మరింత రక్తికట్టిస్తున్నాడు.
ఇక ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే మొత్తం ఏడుగురు సభ్యులు రెడీగా ఉన్నారు. పునర్నవి – హిమజ – అషురెడ్డి – రాహుల్ – బాబా భాస్కర్ – మహేష్ విట్టాతో పాటు శిక్ష పడిన శివజ్యోతిలలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. బిగ్‌బాస్ లీకులతో పాటు సోషల్ మీడియా వర్గాల్లో నడుస్తోన్న చర్చల ప్రకారం ఆదివారం బిగ్ బాస్ నుంచి అషురెడ్డి ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది.
లోపల హౌస్‌లో ఆమెకు చాలా తక్కువుగా స్క్రీన్ కవర్ ఉండడం ఒక మైనస్ అయితే అంతగా ఆకట్టుకోలేకపోతోందని.. బయట కూడా ఆమెకు పెద్దగా ఫాలోయింగ్ లేకుండా పోయిందంటున్నారు. ఈ సారి ఓటింగ్‌లో కూడా ఆమెకే తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇక బయట సోషల్ మీడియాలో కొన్నిసంస్థలు పెట్టిన పోలింగ్‌లోనూ ఆమెకే తక్కువ ఓట్లు రావడంతో ఈ పోలింగ్ ట్రెండ్‌లో ఆమె వెనకపడినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రాహుల్ కూడా ఎలిమినేట్ అవుతారని కొందరు అంటున్నా.. రాహుల్ ఈ వీక్ ప్రదర్శనతో కాస్త సేఫ్ అయ్యాడంటున్నారు. మరి ఈ అంచనాలు ఎలా ఉన్నా ? అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో ? చూడాలి.