బిగ్‌బాస్‌: ఫైన‌ల్ వీక్‌లో కంటెస్టెంట్ల ఫేట్ మారుతోందా…!

-

బిగ్ బాస్ సీజన్-3 ఫినాలేలో ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి తమ ప్రదర్శనతో ఆకట్టుకుని బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్, అలీలు ఫినాలేకు చేరుకున్నారు. వీరిలో ఒక్కరే విన్నర్ గా నిలవనున్నారు. ఆ విన్నర్ ఎవరో ఈ ఆదివారం ఎపిసోడ్లో తేలిపోనుంది. ఇక ప్రస్తుతం ఉన్నఅంచనాల ప్రకారం శ్రీముఖి లేదా రాహుల్ లో ఒకరు విన్నర్ గా నిలిచే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అలాగే వరుణ్, అలీలకు గెలిచే అవకాశాలు లేవని కూడా చర్చ నడుస్తుంది. అయితే బాబా భాస్కర్ కూడా రాహుల్, శ్రీముఖిలకు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనబడుతుంది. మొదటి నుంచి హౌస్ లో అందరితో మంచిగా ఉన్న బాబా…తన కామెడీతో అలరించారు. అలాగే రోజు వంట చేస్తూ లేడీ ప్రేక్షకుల మద్ధతు కూడా సంపాదించుకున్నారు. కాకపోతే బాబాకు రాహుల్, శ్రీముఖిలు లాగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేదు.

ఇదే ఒక్కటే మైనస్ అవుతుంది తప్ప మిగతా విషయాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్లో బాబా అంటే ఏంటో తన జర్నీని చూస్తే అర్ధమవుతుంది. మామూలుగా కొందరు కంటెస్టంట్స్ బాబాని మాస్కర్, ఊసరవెల్లి అంటూ నెగిటివ్ గా మాట్లాడారు. అయితే అవేమీ నిజాలు కాదని బాబా ఫుల్ ఎమోషనల్ అవుతూ…బిగ్ బాసుతో మాట్లాడాడు.

తాను చాలా సెన్సిటివ్ అంటూ డ్రామాలు, యాక్టింగ్ చేయడం నాకు రాదు అంటూ బాబా ఏడుస్తూ ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేశారు. ఈ సన్నివేశాలన్ని ఇప్పుడు ప్రేక్షకుల్లో బాబా పట్ల పాజిటివిటీ పెంచింది. ఇదే ఇప్పుడు బాబాని….రాహుల్,శ్రీముఖిలకు గట్టి పోటీనిచ్చేలా చేస్తుంది. కాకపోతే బిగ్ బాస్ గేమ్ లో  చివరికి ఒక్కరే విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది. మరి ఆ విన్నర్ ఎవరో ఆదివారం తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news