Bigg Boss 3 Episode 2 : మొదటి రోజు సో.. సో.. గా గడిచిపోయింది..!

-

రెండో ఎపిసోడ్.. అంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మొదటిరోజు మాత్రం సో… సో.. గానే నడిచిందని చెప్పాలి. వాళ్లకు సో.. సో.. నే.. ఎపిసోడ్ కూడా సోసోనే. అంత ఫన్ ఎలిమెంట్ కానీ.. ఎంటర్ టైన్ మెంట్ కానీ.. ఏమీ జనరేట్ కాలేదు మొదటి ఎపిసోడ్ లో.

బిగ్ బాస్… సీజన్ 3 నిన్ననే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నిన్న అంటే కంటెస్టెంట్లు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్ వస్తుంటే.. ఎవరబ్బా.. ఎవరీయన? ఎవరీమె? యాక్టరా? లేక డాక్టరా? లేక ఇంకెవరు.. అన్న ఆతృతతో చూశారు. కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ పేలింది. అంతే కాదు.. కొత్త హోస్ట్. అదీ కింగ్ నాగార్జున. అందుకే.. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ను ఎగబడి మరీ చూశారు అంతా.

bigg-boss-season-3-telugu-first-day-review

కానీ.. రెండో ఎపిసోడ్.. అంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మొదటిరోజు మాత్రం సో… సో.. గానే నడిచిందని చెప్పాలి. వాళ్లకు సో.. సో.. నే.. ఎపిసోడ్ కూడా సోసోనే. అంత ఫన్ ఎలిమెంట్ కానీ.. ఎంటర్ టైన్ మెంట్ కానీ.. ఏమీ జనరేట్ కాలేదు మొదటి ఎపిసోడ్ లో.

bigg-boss-season-3-telugu-first-day-review

15 మందిలో ఓ ముగ్గురు నలుగురు తప్పితే మిగితా వాళ్లంతా వాళ్ల సొమ్మేదో లాక్కున్నట్టుగా ముఖాలు పెట్టుకున్నారు.

యాక్టివ్ గా శివజ్యోతి, శ్రీముఖి, హిమజ, హేమ.. ఇంకో ఒకరిద్దరు తప్పితే.. మిగితా వాళ్లంతా ఏదో హౌస్ లో ఉన్నామా? అంటే ఉన్నామా? అన్నట్టుగానే ఉన్నారు.

పోనీయండి. ఇది మొదటి రోజే కదా. హోమ్ సిక్ లాంటివి ఉంటాయి కదా. ఓ రెండు రోజులు ఆగండి.. అందరూ యాక్టివ్ అయిపోతారు అంటారా? సరే.. అలాగే కానివ్వండి.

ఇక.. మొదటి ఎపిసోడ్ లోనే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చాడు. 15 మందిలో ఆరుగురిని ఎలిమినేషన్ కు నామినేట్ చేశాడు.

వరుణ్ సందేశ్, వితికా షేరు, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, జాఫర్ ను ఎలిమినేషన్ కు ఎంపిక చేశాడు బిగ్ బాస్. అయితే.. వాళ్లను ఏ ప్రాతిపదికన బిగ్ బాస్ ఎలిమినేషన్ కు ఎంపిక చేశాడో తెలియదు కానీ.. వాళ్ల పేర్లు మాత్రం అనౌన్స్ చేశాడు. దీంతో ఆ కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.

అంతే కాదు.. ఆ ఆరుగురికి ఒక చాన్స్ కూడా ఇచ్చాడు. వాళ్లంతా కలిసి మిగితా కుటుంబ సభ్యుల్లో ఒకరిని మెంటర్ గా ఎన్నుకోవాలి. ఆ మెంటర్ వాళ్లకు కొన్ని టాస్క్ లు ఇస్తారు. ఆ టాస్క్ ల ప్రకారం.. ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి.

వాళ్లంతా కలిసి అందరికన్నా సీనియర్ అయిన హేమను ఎన్నుకున్నారు. అంతే కాదు.. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వాళ్లు.. మిగితా ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరిని కూడా ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. కాకపోతే.. తమ బదులు వాళ్లను ఎందుకు ఎలిమినేట్ చేయాలో కారణాలను మెంటర్ కు చెప్పాలి. వాళ్లు ఓకే అంటే వీళ్ల బదులు వాళ్లు నామినేట్ అవుతారు.

ఇదే ఇవాళ జరిగిన ఎపిసోడ్. మధ్యమధ్యలో తామంతా కలిసిమెలిసి ఉన్నాం అన్నట్టుగా ఇంటి సభ్యులు ప్రేమగా ఉండటం… ఒకరి వస్తువులు మరొకరు సర్దడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇక.. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనే విషయం రేపు తెలిసే అవకాశం ఉండొచ్చు.

చూద్దాం.. మరి రేపైనా ఇంటి సభ్యులు ఫన్ జనరేట్ చేస్తారో? లేదా.. రేపు కూడా సోసో.. అంటారో?

Read more RELATED
Recommended to you

Latest news