Bigg Boss Telugu 3 Episode 9: హిమజ, శ్రీముఖి టార్గెట్.. ఈవారం ఎలిమినేషన్ లోకి 8 మంది..!

-

నిన్న రెండో వారం మొదలైంది కనుక.. యాజ్ యూజువల్ గా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇంటి సభ్యులంతా.. ఒక్కొక్కరు ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాలి. చాలామంది శ్రీముఖి, హిమజను నామినేట్ చేయగా.. రవి, శివజ్యోతి, అషు, బాబా భాస్కర్, అలి రెజా, రోహిణిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు.

బిగ్ బాస్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ముందుగా అంతా హేమను అక్క అక్క అంటూనే మెల్లగా నామినేషన్ లోకి దించి మొదటి వారమే ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో హౌస్ లో 14 మందే మిగిలారు. అయితే… ఎనిమిదో రోజు ఉదయమే… మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆమె ఎవరో తమన్నా సింహాద్రి. ఓ ట్రాన్స్ జెండర్. బిగ్ బాస్ లో ట్రాన్స్ జెండర్ ను కంటెస్టెంట్ గా తీసుకొని కొత్త ఒరవడి సృష్టించడం ఇదే మొదటిసారి.

ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అందరు ఇంటి సభ్యులు ఆమెను గుర్తు పట్టలేకపోయినప్పటికీ… తమన్నానే అందరిని పరిచయం చేసుకున్నారు.

ఇక.. నిన్న రెండో వారం మొదలైంది కనుక.. యాజ్ యూజువల్ గా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇంటి సభ్యులంతా.. ఒక్కొక్కరు ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాలి. చాలామంది శ్రీముఖి, హిమజను నామినేట్ చేయగా.. రవి, శివజ్యోతి, అషు, బాబా భాస్కర్, అలి రెజా, రోహిణిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. ఇవాళే హౌస్ లోకి వచ్చిన తమన్నా మాత్రం ఈసారి ఎలిమినేషన్ రౌండ్ నుంచి తప్పంచుకుంది.

ఇక.. ఎక్కువ ఓట్లతో శ్రీముఖి, హిమజ నామినేషన్ లో టాప్ లో నిలవగా… తక్కువ ఓట్లతో జాఫర్, మహేశ్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ ఈవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఈ వారం ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.

అయితే.. ఈ ఎపిసోడ్ లో బాబా భాస్కర్ హైలెట్. ఎందుకంటే ఆయన ఎవ్వరినీ నామినేట్ చేయలేదు. ఒక వారంకే వాళ్ల గురించి ఏం తెలిసిందని నామినేట్ చేస్తాం. ఒక్కోసారి నేను కూడా తప్పు చేస్తా. ఎవ్వరూ కరెక్ట్ కాదు.. అలాగని నామినేట్ చేయలేను అని భాస్కర్ చెప్పగా… బిగ్ బాస్.. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తాడు. అయినా బాబా నామినేట్ చేయకపోవడంతో… ఇంటి సభ్యులందరూ నామినేట్ అవ్వడమో లేక బాబా భాస్కర్ నామినేట్ అవ్వడమా ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ బిగ్ బాస్ చెప్పగా… ఇంటి సభ్యులంతా కలిసి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాలంటూ బాబా భాస్కర్ కు సూచించగా… తప్పక భాస్కర్… వితిక, రాహుల్ ను నామినేట్ చేశాడు.

ఈరోజు నుంచి బిగ్ బాస్ కాస్త కఠినంగా వ్యవహరిస్తారు అని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ కు గ్యాస్, వాటర్ కట్ చేశాడు. ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సరిగ్గా పూర్తి చేస్తేనే వాళ్లకు కావాల్సినవన్నీ వస్తాయని తెలుస్తోంది. ఏం జరిగేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news