విచిత్రమైన జర్నలిస్టు.. వరద నీటిలో మునిగి మరీ రిపోర్టింగ్.. వైరల్ వీడియో

-

తన లైఫ్ ను రిస్క్ లో పెట్టి మరీ… వరద నీటిలో దిగి అక్కడి పరిస్థితిని అంచనా వేస్తూ రిపోర్టింగ్ చేసిన మనోడికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా రిపోర్టర్లు ఏం చేస్తారు. ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఆ ప్రదేశానికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను గమనించి.. అక్కడి నుంచే టీవీలకు రిపోర్టింగ్ పంపిస్తుంటారు. ఒక్కోసారి అక్కడి నుంచే లైవ్ షోలు చేస్తుంటారు. అయితే.. అందరు రిపోర్టర్లలా ఇలా చేస్తే ఏముంటుంది కిక్కు అనుకున్నాడో ఏమో.. కానీ.. ఈ రిపోర్టర్ చూడండి.. భారీ వర్షాల వల్ల వరదలు పొంగిపొర్లుతుంటే ఏకంగా వరద నీటిలోకి దిగి మరీ.. మెడ దాకా మునిగి రిపోర్టింగ్ చేశాడు.

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిపోర్టర్ అజాదార్ హుస్సేన్… అక్కడికి వెళ్లి.. అక్కడి పరిస్థితిని లైవ్ లో వరద నీటిలోకి దిగి మరీ వివరించాడు.

తన లైఫ్ ను రిస్క్ లో పెట్టి మరీ… వరద నీటిలో దిగి అక్కడి పరిస్థితిని అంచనా వేస్తూ రిపోర్టింగ్ చేసిన మనోడికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదే పాకిస్థాన్ కు చెందిన మరో రిపోర్టర్ కూడా ఇదివరకు ఇలాగే వరద నీటిలో మునిగి మరీ రిపోర్టింగ్ చేసి సంచలనం సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news