శ్రీముఖి రియ‌ల్ లైఫ్ హీరో & విల‌న్ అత‌డేనా..?

-

టాప్ యాంక‌ర్ శ్రీముఖి ప్ర‌స్తుతం బిగ్‌బాస్ షోలు ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకుపోతోన్న ఆమె పెద్ద బాంబ్ పేల్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వారి జీవితాల్లో ఉన్న ప‌ర్స‌న‌ల్ లైఫ్ సీక్రెట్స్ చెప్పాల‌ని కోర‌గా శ్రీముఖి త‌న రియ‌ల్ లైఫ్‌లో కూడా ఉంది ఒక సెల‌బ్రిటీయే అంటూ బాంబ్ పేల్చింది. అంత‌టితో ఆగ‌కుండా ఆమె అత‌డి ఫేస్ అంద‌రికి తెలిసిందే అని.. అందుకే తాను అత‌డి పేరు చెప్ప‌న‌ని కూడా చెప్పింది.

ఎంతో అందంగా సాగిపోతోన్న త‌మ రిలేష‌న్‌షిఫ్‌లో అనుకోని డిస్ట‌బెన్సులు రావ‌డంతో అత‌డితో పెళ్లి వరకూ వెళ్లిన వ్యవహారం ఉన్నట్లుండి ఆగినట్లు చెప్పింది. చివ‌ర‌కు తాను చ‌చ్చిపోదామ‌ని అనుకున్న‌ట్టు కూడా చెప్పింది. తాను ఎన్నోసార్లు మేక‌ప్ రూం ప‌క్క‌కు వెళ్లి ఏడ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని శ్రీముఖి వెల్ల‌డించింది. శ్రీముఖి రివీల్ చేసిన ఆమె సీక్రెట్ లైఫ్ లో ఉన్న హీరో కమ్ విలన్ ఎవరన్నది ఇప్పుడు చర్చగా మారింది.

ఇక సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం అప్ప‌ట్లో ఆమె యాంక‌ర్ ర‌వితో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రు క‌లిసి చేసిన ప‌టాస్ షో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు శ్రీముఖి కూడా ఆ షో గురించి ప్ర‌స్తావించింది. ఆ టైంలోనే వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డిచిన‌ట్టు టాక్‌. ఆ త‌ర్వాత ఆమె షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఆ త‌ర్వాత వారిద్ద‌రు విడిపోయార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె సీక్రెట్ లైఫ్‌లో ఉన్న హీరో కం విల‌న్ ర‌వినే అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అయితే అప్ప‌ట్లోనే ఆమె ప్రదీప్ తో కూడా యాంకరింగ్ చేసింది. ప్ర‌దీప్ క‌న్నా ర‌వి – శ్రీముఖి గురించే అప్ప‌ట్లో చ‌ర్చ న‌డిచింది. మ‌రి అస‌లు నిజాలు శ్రీముఖికే ఎరుక‌..?

Read more RELATED
Recommended to you

Latest news