శ్రీ‌రెడ్డికి బిత్తిరి స‌త్తి పంచ్‌!

-

ఒకప్పుడు వార్తలు చెప్పుకునే స్థాయి నుంచి ఎదిగి, ఇప్పుడు తానే ఒక వార్తగా నిలిచినటువంటి ప్రముఖ మోస్ట్ వాంటెడ్ సెలబ్రెటీ అయ్యాడు బిత్తిరి సత్తి. ఇప్పుడు అతని వలన చాలామంది టీవీ లకు అతుక్కుపోయారు అంటే అతిశయోక్తి కాదు. కాగా ఇటీవలే తానూ హీరోగా నటించినటువంటి తుపాకీ రాయుడు సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది.


ఇక అసలు విషయానికి వస్తే…. ఓ ప్రయివేట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా తన జీవిత విషయాలను వెల్లడించాడు. కాగా తాను సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎవరు కూడా తనని పట్టించుకునే వారు కాదని, చాలామంది ఇష్టం వచ్చినట్లు తిట్టేవారని, కనీసం ఇక్కడ తినడానికి కూడా అవకాశం లేకపోయిందని చాలా బాధపడుతూ చెప్పాడు. అంతేకాక తానూ ఇంకా 2 సంవత్సరాలు ఇలాగే అవకాశలకోసం ఎదురుచూస్తే తానూ కూడా మీడియా ఎదురుగా నా జీవితం అంతా నాశనం అయింది,

అందరు నన్ను బాగా వాడుకొని వదిలేసారు, అంటూ ఏడవల్సి వచ్చిందని చెప్పారు. కాస్టింగ్ కౌచ్ మాదిరే తను డ్రింకింగ్ కౌచ్ అని కొత్త ఉద్యమాన్ని చేపట్టేవాడినని వాఖ్యానించారు బిత్తిరి సత్తి. కాగా ఈ పంచ్ ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి కి బాగా సూట్ అవుతుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా, ప్రస్తుతానికి ఇది వైరల్ గా మారింది. దీనికి మ‌రి శ్రీ‌రెడ్డి ఏం కౌంట‌ర్ ఇస్త‌దో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news