బిగ్‌బాస్‌: శివజ్యోతి ఎలిమినేష‌న్ క‌న్‌ఫార్మ్‌..!

-

ఆద్యంతం ప్రేక్షకులని ఆకట్టుకుని ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్ సీజన్-3 చివరి దశకు వచ్చేసింది. కరెక్ట్ గా మరో ఎనిమిది రోజుల్లో బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఇందులో ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్ టాప్-5కి చేరుకున్నారు. ఇక మిగిలిన శివజ్యోతి, శ్రీముఖి, వరుణ్, అలీల్లో ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయిపోయి..మిగతా వారు టాప్-5లో తలపడతారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శివ‌జ్యోతి ఎలిమ‌నేట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

మొన్నటివరకు వరుణ్ కూడా స్ట్రాంగ్ కంటెస్టంట్ గానే ఉన్నాడు గానీ, ఎప్పుడైతే భార్య వితికా కోసం గేమ్ ఆడాడో అప్పటి నుంచి కొంత బ్యాడ్ అయ్యాడు. అలాగే వరుణ్ మంచిగానే ఉన్న పెద్దగా టాస్క్ ల్లో గెలిచిన సందర్భాలు కూడా లేవు. పైగా ఆడపిల్ల అయిన శివజ్యోతిని నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల కూడా తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవే అంశాలు అత‌డిని బిగ్‌బాస్ రేసులో కాస్త స్లో చేశాయి. ఇక శివ‌జ్యోతి విష‌యానికి వ‌స్తే ఓ కామ‌న్ విమెన్‌గా హౌస్ లో వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ఆడబిడ్డగా జ్యోతి మంచి మాట తీరుతో ఆకట్టుకుంటుంది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా మంచిగా ముందుకెళ్లింది.

అటు టాస్క్ ల్లో కూడా ఆడపిల్ల అని లేకుండా మగసభ్యులకు సైతం గట్టి పోటీనిచ్చింది. పైగా తెలంగాణ ప్రాంతీయతకు గౌరవం పెంచేలా ఉండటంతో ఆమెకు ఆ ప్రాంతంనుంచి మంచి ఓటింగ్ రావ‌డంతో ఆమె కంటే ఎంతో మంది పాపుల‌ర్ కంటెస్టెంట్లు ఉన్నా శివ‌జ్యోతి దాదాపు ఫైన‌ల్ మెట్టు వ‌ర‌కు వ‌చ్చిన‌ట్ల‌య్యింది.  ముఖ్యంగా శివజ్యోతికు మహిళా వర్గాల మద్ధతు మరింత పెరిగింది. ఇక చివ‌రిగా బిగ్‌బాస్‌లో శ్రీముఖి హ‌వా న‌డుస్తోంది. ఆమె ఫైన‌ల్‌కు వ‌చ్చే స‌రికి చాలా తెలివైన ఆట ఆడుతోంది.

నిన్న‌టికి నిన్న త‌న‌కు ఎవ‌రో సెల‌బ్రిటీతో రిలేష‌న్ షిఫ్ ఉంద‌ని చెప్పి ఒక్క‌సారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్ప‌టికే బాబా భాస్క‌ర్‌, వ‌రుణ్‌ను త‌న కంట్రోల్లో ఉంచుకున్న‌ట్టు ఆట చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక ప్లెయిన్‌గా ఆడే రాహుల్ ఇప్ప‌టికే ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. ఇక ఒక‌సారి బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చిన ఆలీ కంటే శివ‌జ్యోతి ఫైన‌ల్స్‌లో ఉండ‌డ‌మే బెట‌ర్‌. అయితే ఆమె అమాక‌య‌క‌త్వం, కుట్ర‌లు ప్లే చేయ‌డం రాక‌పోవ‌డం ఇలా ఎన్నో కార‌ణాలు ఆమెను హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేలా చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version