బిగ్‌బాస్ 3 విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయిందా… ఈ ముగ్గురికే ఛాన్స్‌

-

బిగ్‌బాస్ 3 10 వారంలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి కాస్త ఇంట్ర‌స్టింగ్‌తో సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ షో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు నానా ఆపసోపాలు ప‌డింది. ఇప్పుడిప్పుడే షోకు మంచి టీఆర్పీ రేటింగులు వ‌స్తున్నాయి. ఇక తాజాగా ఆదివారం జ‌రిగిన ఎల‌మినేష‌న్లో షోలో ముందు నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌లో ఒక‌రిగా ఉన్న ర‌వి ఎలిమినేట్ అవ్వ‌డం చాలా మందికి షాక్ ఇచ్చింది.

ర‌వి ముందు నుంచి వ‌రుణ్‌సందేశ్‌, శ్రీముఖి, బాబా భాస్క‌ర్ త‌ర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌లో ఒక‌రిగా ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా దగ్గరైన నటుడు రవి కృష్ణ. ఆయ‌న‌కు మ‌ధ్య త‌ర‌గి ప్ర‌జ‌ల‌తో పాటు సీరియ‌ల్స్ బాగా చూసే వారిలో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక సామాజిక‌వ‌ర్గ ప‌రంగా కూడా ర‌వి బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ వ‌ర్గం గ్రూపుల్లో ర‌వికి ఓట్లేయాల‌ని ఓ క్యాంపెయిన్ కూడా చేశారు.

అయితే అనూహ్యంగా నిన్న ఆయన బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వారం ఎలిమినేష‌న్లో న‌లుగురు టాప్ కంటెస్టెంట్లు ఉండ‌డంతో చివ‌ర‌కు బ‌ల‌మైన కంటెస్టెంట్ అయిన ర‌వి బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు. ఈ విధంగా చూస్తే టైటిల్ పేవరేట్స్ లో కేవలం ముగ్గురే మిగిలినట్టు లెక్క. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ల లో ఒకరు టైటిల్ గెలుస్తారనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇక మ‌రో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా రీ ఎంట్రీ ఇచ్చినా ఆయ‌నకు టైటిల్ గెలిచే ఛాన్సులు త‌క్కువే. దీనికి కార‌ణం ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజాను ప్రేక్ష‌కులు మ‌ళ్లీ తిరిగి గెలిపిస్తార‌ని ఆశించ‌లేం. ఇక శ్రీముఖి, వ‌రుణ్‌, బాబా భాస్క‌ర్ మ‌ధ్య టైటిల్ పోటీ ఉన్నా ఫైన‌ల్‌గా వ‌రుణ్ వ‌ర్సెస్ శ్రీముఖి మ‌ధ్యే ఉంటుంద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news