ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు. ఆ మైనర్ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు ఇంకా పెళ్లి కాకపోవడంతో.. బిడ్డ పుట్టిందని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని శిశువును అక్కడే వదిలి వేళ్లేందుకు ప్రయత్నించింది.
అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శిశువుకు ఎలాంటి హానీ కలగలేదు. ఈ ఘటన యూపీలోని బారెల్లీలో చోటు చేసుకుంది. అయితే కూతురు గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని, కడుపు నొప్పి అని ఆస్పత్రికి తీసుకొచ్చానని బాలిక తండ్రి వివరించారు. ఇక ఆమెకు చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ (సిఐఎఫ్) కౌన్సిలింగ్ ఇచ్చినా.. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆ బిడ్డను తీసుకెళ్లనని తేల్చి చెప్పింది. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆమె మారకపోవడంతో.. రెండు నెలల తర్వాత మేమే శిశు సంక్షేమ సెంటర్‌కి తీసుకెళ్తాం. కావాల్సిన వారికి దత్తత ఇస్తామని తెలిపారు.