బిగ్‌బాస్ షోలో వారం వారం ఎలిమినేషన్లలో ఉన్నవారికి ఎలా ఓటు వేయాలో ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు తెలియడం లేదు. గతంలో మాదిరిగా ఓటింగ్ లేకపోవడంతో కంటెస్టెంట్లకు ఎలా ఓటు వేయాలా..? అని వారు సందేహిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 హాట్ హాట్‌గా సాగుతోంది. గత సీజన్ల కన్నా ఈ సీజన్‌కు మంచి టీఆర్‌పీలు కూడా వస్తుండడంతో స్టార్ మా ఉత్సాహంగా ఉంది. అయితే షో బాగానే సాగుతున్నా.. అనవసరంగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని అందులోకి తెచ్చి తప్పు చేశామని స్టార్ మా భావించింది. ఇక ఆమె ఎలాగో ఎలిమినేట్ అయ్యింది కనుక ఇప్పుడు స్టార్ మా యాజమాన్యంతోపాటు అటు ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో బిగ్‌బాస్ షో మళ్లీ ఉత్సాహంగా సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే బిగ్‌బాస్ షోలో వారం వారం ఎలిమినేషన్లలో ఉన్నవారికి ఎలా ఓటు వేయాలో ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు తెలియడం లేదు. గతంలో మాదిరిగా ఓటింగ్ లేకపోవడంతో కంటెస్టెంట్లకు ఎలా ఓటు వేయాలా..? అని వారు సందేహిస్తున్నారు. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓటు వేయడం మాత్రం చాలా తేలికే.. అది ఎలాగంటే…
బిగ్‌బాస్ షోలో ఎలిమినేషన్ ఉన్న కంటెస్టెంట్లకు ఓటు వేసేందుకు స్టార్ మా రెండు ఆప్షన్లను ఇస్తోంది. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం.
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓటు వేయాలంటే ప్రేక్షకులు హాట్‌స్టార్ యాప్‌ను (ఆండ్రాయిడ్, ఐఓఎస్) డౌన్‌లోడ్ చేసుకుని అందులోకి మొబైల్ నంబర్, ఓటీపీ లేదా ఈమెయిల్, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. ఒక వేళ అందులో అకౌంట్ లేకుంటే యూజర్లు ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఉండే బిగ్‌బాస్ షోకు చెందిన ఏదైనా ఒక ఎపిసోడ్ వీడియోపై క్లిక్ చేయాలి. అనంతరం వీడియో ఓపెన్ అవుతుంది. దాని కిందే బిగ్‌బాస్ ఓటింగ్ అని వస్తుంది. అందులో ఆ వారం ఎలిమినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఫొటోలు వస్తాయి. ఇక వారికి ఓటు వేసేందుకు గాను 10 ఓట్లు అందుబాటులో ఉంటాయి. ఆ 10 ఓట్లను ప్రేక్షకులు ఒక్కరికే వేయవచ్చు. లేదా తమకు నచ్చిన వారికి ఆ ఓట్లను విభజించి వేయవచ్చు. ఇలా వీకెండ్ వచ్చే సరికి హాట్‌స్టార్ యాప్ ద్వారా రోజుకు ప్రేక్షకులు 10 ఓట్లను వినియోగించుకోవచ్చు. అయితే ఒక వేళ వీడియోపై క్లిక్ చేసినా కింద ఓటింగ్ ఆప్షన్ గనక రాకపోతే అప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తరువాత కచ్చితంగా ఓటింగ్ ఆప్షన్ వస్తుంది. అందులో ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఓటు వేయవచ్చు.
ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓటు వేసేందుకు అందుబాటులో ఉన్న మరొక పద్ధతి.. మిస్డ్ కాల్ ఇవ్వడం.. ఆ వారం ఎలిమినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు గాను ఒక్కొక్కరికి బిగ్‌బాస్ ఒక్కో ఫోన్ నంబర్ కేటాయిస్తారు. ప్రేక్షకులు చేయాల్సిందల్లా తమకు నచ్చిన వారికి చెందిన ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడమే. అయితే ఇందుకు గాను ప్రేక్షకులకు రోజుకు 50 ఓట్లు ఉంటాయి. 50 ఓట్లను తమకు నచ్చిన ఒకే ఒక్క కంటెస్టెంట్‌కు వేయవచ్చు. లేదా వాటిని విభజించి వేయవచ్చు. ఇందుకు గాను ప్రేక్షకులు ఒక్క ఓట్ వేసేందుకు ఒక్కసారి ఆ కంటెస్టెంట్ ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అలా ఎన్ని సార్లు మిస్డ్ కాల్ ఇస్తే అన్ని ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు పడతాయన్నమాట. అంటే 50 ఓట్లకు 50 సార్లు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నమాట. ఇలా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లకు ఓట్లు వేయవచ్చు..!