బిగ్‌బాస్ విన్న‌ర్‌కు ఫ్యూచ‌ర్ ఉండ‌దా…. రీజ‌న్ ఇదే..

-

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌.. పేరు ఘనం ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంద‌న్న సెటైర్లు ప‌డుతున్నాయి. తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఆదివారం గ్రాండ్ ఫినాలే జ‌రుగుతోంది. ఈ ఫైన‌ల్లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్ విన్న‌ర్‌గా గెలిచిన వాళ్ల భ‌విష్య‌త్తు అంధ‌కార‌మేనా ?  ఎందుకంటే గ‌త రెండు సీజ‌న్ల సెంటిమెంట్ల‌ను బ‌ట్టి చూస్తే ఇక్క‌డ గెలిచినా వాళ్ల‌కు బ‌య‌ట ఒరిగేందేమి ఉండ‌డం లేదు.

బ‌య‌ట జ‌నాల్లో కొద్దోగొప్పో పేరు ఉన్న వాళ్ల‌ను కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు ఉంటుంది. వాళ్లు నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌కుండా హౌస్‌లో ఉండేలా బాండ్ రాయించుకుంటారు. ఇక షోలో పాల్గొన్న పాపుల‌ర్ కంటెస్టెంట్ల‌తో నిర్వాహ‌కుల‌కు బాగానే రేటింగుల‌తో గిట్టుబాటు అయినా.. షో పాల్గొన్నవారికి మాత్రం అంతకుమునుపు ఉన్న పేరు కూడా ఊడిపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ సారి బిగ్‌బాస్ రేటింగుల ప‌రంగా కూడా క్లిక్ కాలేద‌న్న‌ది వేరే విష‌యం. ఇక విన్న‌ర్లుగా గెలిచిన వాళ్ల‌కు సైతం అంత‌కు ముందు ఉన్న పేరు ఉండ‌డం లేదు. తొలి సీజ‌న్ విన్న‌ర్ శివ‌బాలాజీ, ర‌న్న‌ర్ ఆద‌ర్శ ఆ త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు. ఇక సెకండ్ సీజ‌న్లో విన్న‌ర్ కౌశ‌ల్ షోలో ఉన్న‌ప్పుడు నానా ర‌చ్చ జ‌రిగింది. కౌశ‌ల్ విన్న‌ర్‌, గీతామాధురి ర‌న్న‌ర్ అయ్యాక వాళ్ల‌కు అంత‌కు ముందున్న పేరు ఉందా ? అంటే ఆ త‌ర్వాత పెద్ద‌గా పెరిగిన పాపులార్టీ అయితే లేదు.

శివబాలాజీ బిగ్‌బాస్ గెలిచాక ఒక‌టి రెండు సినిమాల్లో మాత్ర‌మే క‌నిపించారు. ఇక కౌశ‌ల్ ఆ త‌ర్వాత వివాదాల్లో కూరుకుపోయారు. మీడియా కూడా ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ 3 విన్న‌ర్ అయ్యేవాళ్ల‌కు అదే ప‌రిస్థితి కంటిన్యూ అవుతుందా ?  లేదా ?  బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌రింత పాపుల‌ర్ అవుతారా ? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version