బిగ్ బాస్: ఇంటి నుంచి వెళ్లిపోయే మొదటి వ్యక్తి అతడే.. జోస్యం చెప్పిన కత్తి మహేశ్

-

హేమ, శ్రీముఖి, రాహుల్, వితిక, వరుణ్, మహేశ్ విట్ట, హిమజ… లాంటి కంటెస్టెంట్లు గొడవలతో షోకు కాస్త పాపులారిటీ తీసుకొచ్చారు. ఇక.. ఈ షో మొదటి ఎపిసోడ్ కు టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా వచ్చాయి. దీంతో హోస్ట్ నాగార్జునతో పాటు.. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఖుషీ అయ్యారట.

తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నారు. రాత్రి 9.30 అయిందంటే చాలు.. టీవీ ఆన్ చేసి బిగ్ బాస్ షోను చూస్తున్నారు. అయితే.. బిగ్ బాస్ సీజన్ 3 ముందు రెండు మూడు ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకోనప్పటికీ.. తర్వాత పుంజుకుంది. ఇంట్లో గొడవలు పెరుగుతుండటంతో.. షో రక్తికడుతోంది.

kathi mahesh guesses first eliminator in bigg boss 3

హేమ, శ్రీముఖి, రాహుల్, వితిక, వరుణ్, మహేశ్ విట్ట, హిమజ… లాంటి కంటెస్టెంట్లు గొడవలతో షోకు కాస్త పాపులారిటీ తీసుకొచ్చారు. ఇక.. ఈ షో మొదటి ఎపిసోడ్ కు టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా వచ్చాయి. దీంతో హోస్ట్ నాగార్జునతో పాటు.. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఖుషీ అయ్యారట.

ఇక.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్లను బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. ఇవాళ, రేపు ఎలిమినేషన్స్ ఉండొచ్చు. మొదటి వీక్ లో ఎలిమినేషన్ లో రాహుల్, హేమ, శ్రీముఖి, జాఫర్, హిమజ, వితిక ఉన్నారు. వీళ్లలో ఎవరో ఒకరు షోను వదిలి వెళ్లిపోవాల్సిందే. ఆ విషయం ఇవాళ్టి ఎపిసోడ్ లోనో లేక రేపటి ఎపిసోడ్ లోనో తెలుస్తుంది.

అయితే… బిగ్ బాస్ సీజన్ 3లో హౌస్ నుంచి వెళ్లిపోయే మొదటి వ్యక్తి ఎవరో ఊహించేశాడు కత్తి మహేశ్. ఆయన బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్. అంతే కాదు. ఆయన ఓ క్రిటిక్. ఆయన గురించి మీకు తెలిసిందే. ఆయన వివాదాల గురించి కూడా తెలిసిందే.

ఇక.. హౌస్ నుంచి వెళ్లిపోయే మొదటి వ్యక్తి ఎవరో కూడా ముందే చెప్పేశాడు కత్తి మహేశ్. తన ఫేస్ బుక్ ఖాతాలో మొదటి ఎలిమినేషన్ లో బయటికి వెళ్లిపోయే వ్యక్తి ఎవరో చెప్పేశాడు.

నోరు జారినోళ్లే మొదటి వారంలో ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ 1 లో జ్యోతి, బిగ్ బాస్ 2లో సంజన, బిగ్ బాస్ 3లో రాహుల్ బయటికి వెళ్లే చాన్స్ కనిపిస్తోంది అంటూ పోస్ట్ పెట్టాడు కత్తి మహేశ్.

అయితే.. రాహుల్ ఎప్పుడు నోరు జారాడు.. అని బిగ్ బాస్ అభిమానులు ఆరా తీస్తే.. ఫుడ్ విషయంలో రెండు మూడు సార్లు హేమ, శ్రీముఖితో రాహుల్ గొడవ పడిన మాట వాస్తవమే కానీ.. అంతలా ఆయన అక్కడ నోరు జారిందైతే ఏమీ లేదంటూ చెబుతున్నారు.

మహేశ్ కత్తి ఏదో ఒకటి పోస్టు పెడుతూనే ఉంటాడు కదా. బిగ్ బాస్ ప్రారంభం కాకముందు కూడా… సెక్స్ గురించి ఓ పోస్ట్ పెట్టాడు. గాయత్రి గుప్త బిగ్ బాస్ పై ఆరోపణలు చేసింది కదా. ఆ నేపథ్యంలోనే ఆయన ఆ పోస్ట్ పెట్టాడు.

ఏది ఏమైనా బిగ్ బాస్ 3 నుంచి మొదటి సారి ఎలిమినేట్ ఎవరు అవుతారా? అని అంతా టెన్షన్ తో ఉన్నారు. చూద్దాం.. మహేశ్ లెక్క సరిగ్గా ఉంటుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news