బిగ్‌బాస్ హౌస్‌లోకి బిగ్‌బ్యాచ్… రచ్చ చేశారుగా…

-

బిగ్‌బాస్ ఫినాలే వారం చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట సోమవారం, మంగళవారం ఎపిసోడ్ల యాంకర్ సుమ సందడి చేయగా, బుధవారం, గురువారం ఎపిసోడ్లలో ఫినాలేకు చేరుకున్న ఐదుగురు ఇంటిసభ్యుల మొత్తం జర్నీని చూపించి ఎమోషనల్ చేశాడు. ఇక శుక్రవారం ఎపిసోడ్లో షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ప్రత్యేక అతిథులుగా ఎంట్రీలు ఇచ్చి ఆసక్తికరంగా మార్చేశారు. మొదట రవికృష్ణ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇంటిలోని ఐదుగురు సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. నెక్ట్స్‌ జాఫర్ రావడంతో….బాబా భాస్కర్ ఆనందానికి అవధుల్లేవు. జాఫర్….బాబాని ఎత్తుకుని తిప్పేశారు. ఎప్పటిలాగానే బాబా…జాఫర్ మీద సెటైర్లు వేసి నవ్వించాడు.

ఇక తర్వాత రోహిణి, ఆషులు ఒకేసారి ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. వీళ్లిద్దరూ హౌస్‌లోకి అడుగుపెట్టగానే మొదటిగా శ్రీముఖి గట్టిగా కేక పెట్టింది. ఆ తరవాత వీరిద్దరూ అందరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం హౌస్ లోకి ఓ సర్ప్రైజ్ ఎంట్రీ వచ్చింది. హౌస్ లో రెండు వారాలు రచ్చ చేసిన తమన్నా సింహాద్రి హాట్ డ్రెస్ తో హౌస్‌ లోకి వచ్చింది. శ్రీముఖిని హగ్ చేసుకుని, బాబా కాళ్ళకు నమస్కారం చేసి, మిగిలిన వారిని పలకరించింది. మధ్యాహ్నం భోజనం సమయంలో పునర్నవి, వితికా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

శ్రీముఖి పునర్నవవిని అయితే చంటి పిల్లను ఎత్తుకున్నట్టు ఎత్తుకుని రాహుల్ దగ్గరికి తీసుకెళ్లగా… రాహుల్ కూడా ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు. మరోవైపు వితికా వరుణ్ ని గట్టిగా కౌగిలించుకుని అలాగే ఉండిపోయింది. ఇక వీరి తర్వాత శిల్పా చక్రవర్తి, శివజ్యోతి, మహేశ్, హేమ, హిమజలు వరుసగా వచ్చి సందడి చేశారు. ఇక తర్వాత ఎవరికి వారే ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట ఎలా ఉందనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ బ్యాచ్ శనివారం, ఆదివారం ఎపిసోడ్లలో కూడా కొనసాగనున్నారు. ఇక ఆదివారం బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ ఎవరో తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version