నిర్మలమ్మ బడ్జెట్ 2024-25లో ఊరట కలిగిస్తున్న ఈ కీలక ప్రకటనలు!

-

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను ఆమె రూపొందించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు.

నిర్మలమ్మ బడ్జెట్లో..స్టాండర్డ్‌ డిడక్షన్‌ అనేది రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచడం జరిగింది. అయితే సున్నా నుంచి రూ.3 లక్షల దాకా ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం, రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వర్తిస్తుందని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో వేతన జీవులకు ఊరట కలిగింది.దీనిపై సోషల్ మీడియాలో సానుకూల స్పందన వస్తుంది.

అలాగే మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ పీసీడీఏ, మొబైల్‌ ఛార్జర్లపై విధించే బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గించడం జరిగింది.దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలనేవి తగ్గనున్నాయి. ఇది ఖరీదైన ఫోన్లని కొనలేని సామాన్యులకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.అలాగే బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 శాతానికి ఇంకా ప్లాటినమ్‌పై 6.4శాతానికి తగ్గించడం జరిగింది.దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉండటం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుంది.

ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం జరిగింది.వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం ఈ లోన్స్ అందిస్తాయని నిర్మలా తెలిపారు. అలాగే బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం కూడా మంచి విషయంగా చెప్పుకోవచ్చు.ఇక వచ్చే ఐదేళ్లలో ఏకంగా 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడంతో పాటు 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు కల్పించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఇది నిజంగా కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయం.

అలాగే దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు చాలా మంది విద్యార్థులకు ఆర్ధిక స్థోమత సరిపోదు. అలాంటి వారికి ఏకంగా రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు మంచి మేలు కలుగుతుంది.అలాగే మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు పెట్టనున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలిచినట్లు ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. విద్య, ఉపాధి, నైపుణ్యాలభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయించడం కూడా నిజంగా చాలా మంచి విషయం.నిరుద్యోగులకు మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సహకాల వల్ల వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లించడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news