ఇక సినిమాలు వద్దు.. బుద్ధిగా చదువుకో అన్నారు.. కృష్ణ గురించి మహేశ్ బాబు

-

రేపు అనగా జూన్ 16న మూడో ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఈసందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తండ్రి కృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

మా నాన్న మాట్లాడేటప్పుడు సమయమే తెలియదు. ఆయన జోక్స్ బాగా వేస్తారు. నా సినిమాలకు ఉత్తమ విమర్శకులు ఆయనే.. మొదటగా నా సినిమా గురించి నిస్సంకోచంగా చెప్పేది కూడా ఆయనే. నేను పుట్టడంతోనే ఓ గుర్తింపుతో పుట్టా. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిగా పుట్టడమే నేను చేసుకున్న అదృష్టం. అంతకన్నా గుర్తింపును ఏ తండ్రి ఇవ్వగలడు.

వేసవి సెలవుల్లో నన్ను ఊటీకి తీసుకెళ్లేవారు నాన్న. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం ఎంత ముఖ్యమో… ఆ స్వేచ్ఛ వల్ల వాళ్ల జీవితం దారి తప్పకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని నాన్న నమ్ముతారు. నేను బాలనటుడిగా దూసుకుపోతున్న సమయంలో.. ఇక సినిమాలు వద్దు.. ముందు బుద్ధిగా చదువుకో.. తర్వాత చూద్దాం అని నాన్న అన్నారు. అప్పుడు నేను నాన్నకు ఎదురు చెప్పలేదు.

డిగ్రీ చేస్తున్న సమయంలోనే మళ్లీ సినిమాలు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని నాన్నకు చెప్పాను. నాన్న కూడా ఒప్పుకున్నారు. దీంతో నా సినిమా కెరీర్ ప్రారంభమైంది. అప్పుడు నాన్న సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టే.. నేను ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉన్నా. ఇదంతా నాన్న చలువే. అందుకే.. నాన్న ఎప్పుడూ నాకు స్పెషలే.. అంటూ మహేశ్.. తన నాన్నతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version