బిడ్డలకు నేర్పాలి
మంచి..చెడుకు సాయం చేయకపోతే మంచి
చెడు..మంచి నిర్మాణ గతిని కూల్చకుండా ఉండగలిగితే మంచి
వీటి దగ్గర బిడ్డలు ఎలా ఉన్నారు.. ఏది మంచి? ఏది చెడు? ఇలాంటి ప్రశ్నలు బిడ్డలకు ఇవ్వండి..మీరు మాట్లాడితేనే ప్రశ్నలూ.. జవాబులూదోగాడుతున్నాయి కదా! ఇదీ ప్రకాశ్ అందించే మనోగతం.
“నాన్న దగ్గర బిడ్డ ఎదిగిన ఊహ
అమ్మ దగ్గర బిడ్డ ఎగిరిన గువ్వ
రెక్కలు ఇవ్వండి కాదు రెక్కలు కట్టుకుని పోనివ్వండి..ఇది కదా కావాలి..గువ్వలకు రెక్కలు..గూటి పక్షుల తోడు నుంచి వీడుకోలు..కాస్త మీ ఆకాశం నుంచి అగాధం దాకా ఎగరనివ్వండి..ఎగరనివ్వడం స్వేచ్ఛ.. ఎదగనివ్వడం బాధ్యత ” అని విన్నాను.బిడ్డలంతా బాధ్యతగా స్వేచ్ఛను విని యోగించుకోవాలంటే వారితో మీరు మాట్లాడాలి..వింటున్నారా..అంటు
కొమ్మచాటు పూవులు
బిడ్డలూ పూవులూ ఒక్కటే
పసి పాదాలకు కందిపోవడంతెల్సు
అమ్మకు పాదాలను కందిపోనీయకపోవడం తెల్సు
పూలకూ-రాగాలకూ విడిపోవడం తెలియదే…
తల్లిదండ్రులుగా విడిపోకపోవడం గురించి చెప్పేడు
పిల్లలకు నేర్పడం అన్నది ఓ ప్రాథమిక అవసరంగా ఎలా మారాలి ఈ తల్లిదం డ్రులకు – మీరు పుస్తకాలు ఇవ్వండి లేదా మీరే ఓ పుస్తకంగా మారండి తెరచిన పుస్తకంలో లొసుగులా నో..నో..నో ఛాన్స్..అలాంటివే వద్దు..రియల్ పేరెంటింగ్ అంటే ఇదే..
“గ్రోత్ అంటే ఎదగడం కాదు ఎదగనివ్వడం ..గ్రోత్ రేట్ అంటే లెక్కింపు కాదు కావాల్సినంతగా ఎగబాకేలా చేయడం”
ఇవి కాదా కావాలి.. మిస్టర్ ప్రకాశ్ ఇవే చెబుతాడు..అమ్మా- నాన్నా వీరు కదా మార్గదర్శకం కావాలి..
మీరు మాట్లాడడం మొదలుపెట్టండి..పిల్లలతో రహస్యాలా?నో..నో..వాటికి చోటే ఇవ్వొద్దు..అని అంటున్నాడతడు.నాన్నలంతా ఒకలా..ఒకేలా..ఉంటారని ఒక యూనిఫాం డ్రెస్ కోడ్ ఉంటుందని ఎలా చెప్పగలను..?నాన్నలంతా మూర్ఖత్వ పు ముసుగులో ఉంటారని ఉంటున్నారని ఎలా అనుకోగలను..?ఓ ప్రదేశాన్ని ఖాళీ చేశాక జీవితం వ్యాప్తిని ఎలా కోరుకుంటుందని.. ప్రదేశాన్నీ,వ్యాప్తినీ ఒకేసా రి ప్రేమించడం నేర్చుకోవడం తప్పక చేయాల్సిన పని..మందలో తప్పిపోతే నా
న్న- మందలో మిగిలిపోతే నాన్న – మంద నుంచి మందలింపు దాకా నాన్న.. మీ బిడ్డలకు ఈ తరహా నాన్న అర్థం అవుతున్నాడా? అన్నదే సిసలు ప్రశ్న.
మీ..మీ..ఇరుకిరుకు బతుకుల్లో………………..
విస్తృతికి నోచుకోని జ్ఞాపకాల్లో………………
వదిలించుకోవాల్సినంత మురికి
వదిలించినా వీడిపోని మురికి
ఇంకా ఉంటే ఆ నలుపు చెరిపేయడం ఓ ప్రయత్నం
ఆ దిగులు రంగును వదిలించడం ఓ చేయకతప్పని పని
బిడ్డలకు వాత్సల్యం – ప్రేమ వీటినే పంచాలి అనుకుంటే
మీరు..మీరనుకునే ప్రపంచంలో తప్పక విజేతలే!
తెరచిన పుస్తకం నోరు తెరవక చెప్పే జ్ఞాన రహస్యం ఇదే!
పాదాలకు నేర్పాల్సింది పరుగునో/నడకనో ఏంటన్నది తేల్చుకోవాల్సింది మీరే!