ఓ ప్రేమికుడికి గాంధీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?

-

ఇవాళ మహాత్మా గాంధీ 150 వ జయంతి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గాంధీజీకి సహాయకుడిగా పనిచేసిన నిర్మల్ కుమార్ బోస్ అనే వ్యక్తి ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి.. ఆసక్తికరమైన విషయమేంటే బోస్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి..

గాంధీకి సమయపాలన అలవాటు. ఏ పని అయినా టైమ్ టు టైమ్ చేసేవారు. ఒక్క క్షణాన్ని కూడా వృథా చేసేవారు కాదు. ఆయనుకు వచ్చిన ఉత్తరాలను చదివి వినిపించేవాడిని. అది కూడా ఉదయం పూట భోజనం చేసే సమయానికి ఆ ఉత్తరాలను చదివి వినిపించేవాడిని. ఆయనను సలహా కోరుతూ… ఆశీర్వాదం కోరుతూ చాలా మంది ఉత్తరాలు రాసేవారు. ఓరోజు చాలా ఉత్తరాలు వచ్చే సరికి చదవలేక నేను కొంచెం విసుక్కున్నాను. దీంతో గాంధీ వెంటనే ప్రజలంటే నీకు అంత చిరాకుగా ఉందా? అంటూ కొంచెం కోపంగానే అన్నారు. ఇక.. నేను ఉత్తరాలు చదవడం ప్రారంభించా. ఓ వ్యక్తి తన పెళ్లి గురించి సాయం కోరుతూ గాంధీకి ఉత్తరం రాశాడు.

నిర్మల్ కుమార్ బోస్…

తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు తన తండ్రి ఒప్పుకోవడం లేదని.. తన పెళ్లి జరిపించేలా మీరే చూడాలని ఆ వ్యక్తి ఉత్తరంలో తెలిపాడు. ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత పక్కన పెడదామని అనుకునేలోపే గాంధీ ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు. మొత్తం చదివి సాయంకాలం ఆ వ్యక్తికి గాంధీజీ ఉత్తరం రాశాడు.

“మీ తండ్రి మీ పెళ్లికి ఒప్పుకోనప్పుడు ఆయనతో ఉండకండి. వేరుగా బతకండి. కనీసం ఓ రెండు మూడేళ్లు కూలిపనో.. వేరే పనో చేసుకొని బతకాలి. అలా రెండుమూడేళ్లు నువ్వు ఒంటరిగా బతికి చూపిస్తే… ఈ పరీక్షను నువ్వు దైర్యంగా ఎదుర్కోగలిగితే… అప్పటికీ నీ ప్రేమ నిలబడితే నా దీవెనలు నీకు ఉంటాయి..” అని గాంధీ ఉత్తరంలో పేర్కొన్నారు.

దీంతో నేను కొంచెం చొరవ తీసుకొని ఎందుకండీ.. ఆ ఉత్తరానికి జవాబు రాయడం.. అని గాంధీని అడిగా. దీంతో గాంధీ ఏమన్నారంటే.. “ఆ యువకుడికి ఇంకా ఏం చెప్పాలి. దేశం కోసం పోరాడుతావా? అని అడిగాననుకో. నా ఫ్యామిలీని వదిలేసి దేశం కోసం పోరాడాలా? అని అంటాడు. అతడు తన జీవన గమనాన్ని తప్పాడు. దారి తప్పాడు. అతడికి సరైన దారి చూపించడం కోసం నా జీవితంలోని కొన్ని నిమిషాలను అతడి కోసం ఖర్చు పెట్టగలగడమే నేను చేయగల సాయం..” అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటికి కానీ.. నాకు గాంధీ అసలు మనస్తత్వం అర్థం కాలేదు. ఇలా దేశంలోని ప్రతి ఒక్కరి కోసం గాంధీ తాపత్రయపడేవారు. ఆ గుణమే గాంధీజీని మహాత్ముడిని చేసింది. జాతిపితను చేసింది. ఆయన వెనుక కోట్ల మంది జనం నడువడానికి కారణం కూడా ఆయన గుణమే.. అంటూ ముగించాడు నిర్మల్.

Read more RELATED
Recommended to you

Latest news