అమెరికాలో తెలుగు మహిళల కోసం… “WETA”..!!!

98

అమెరికాలో ఎంతో మంది భారతీయులు వివిధ ఉద్యోగాల, వ్యాపారాల కారణంగానో స్థిరపడ్డారు. అందులో తెలుగు వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో తెలుగు వారు ఎంతో మంది స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు.  అయితే తెలుగు వారందరూ ఒకే తాటిపై ఉండటానికి, ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఎంతో సంతోషంగా గడపడానికి, తెలుగు వారి సాధక బాధలు పరిష్కరించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఎన్నో ప్రాంతాల వారిగా ఎన్నో సంస్థలని ఏర్పాటు చేసుకున్నారు.

MP Sumalatha Launches WETA In California | TNILIVE USA Telugu News

తానా, ఆటా, నాటా,ఇలా ఎన్నో తెలుగు సంస్థలు అమెరికాలో ఉన్నాయి. ఎన్ని సంస్థలు ఉన్నా సరే వాటి ముఖ్య ఉద్దేశ్యం తెలుగు వారికి తోడుగా ఉండటం. తెలుగు సంస్కృతిని కాపాడటం, భవిష్యత్తు తరాల వారికి తెలుగు వెలుగుల భాద్యతని అప్పగించడం. కానీ ఇప్పటి వరకూ అమెరికాలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తించిన ఝాన్సీ రెడ్డి

అమెరికాలో ఉండే తెలుగు మహిళలకి కూడా ప్రత్యేకమైన వేదిక కావాలని భావించారు. అందుకు తగ్గట్టుగా women empowerment telugu association (WETA ) పేరుతో ఓ సంస్థని ఏర్పాటు చేశారు. తెలుగు మహిళలకి ఎటువంటి ఆపద వచ్చినా, ఎలాంటి అవసరమైన సరే తప్పకుండా WETA ముందు ఉంటుందని ఆమె అన్నారు. ఎన్నో ఏళ్ళుగా శ్రమించి WETA రూపకల్పన చేసినట్టుగా ఆమె తెలిపారు.

ఈ సంస్థని సినీ నటి, ఎంపీ సుమలత చేతుల మీదుగా అమెరికాలో ప్రారంభించారు. మహిళల కోసం ప్రత్యేకంగా అమెరికాలో ఓ వేదిక ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని సుమలత తెలిపారు. ఇదిలాఉంటే WETA సంస్థ చైర్మెన్  అయిన ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని టెక్సాస్ లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు.