భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్ చూపిన పోరాట స్ఫూర్తి మరువలేనిది. తెల్లదొరలకు ఆయనంటే హడల్ ఉండేది. తాను చనిపోయే వరకు తుదిశ్వాస వరకు భారత స్వాతంత్య్రం కోసమే ఆయన పోరాడారు. చిన్న వయస్సులోనే ఉద్యమకారుడిగా వీరమరణం పొందాడు. భగత్‌సింగ్ 1907వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్‌లకు జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ భావాలను ఆయన తండ్రి నుంచే పుణికిపుచ్చుకున్నారు. అందువల్ల చిన్న వయస్సులోనే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
భగత్‌సింగ్ చదువుకునే రోజుల్లో ఆయనపై జలియన్‌వాలాబాగ్ మారణకాండ తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. దాంతో ఆయనలో విప్లవ భావాలు మరింత పెరిగాయి. విదేశాల్లోని భారత విప్లవ వీరుల గురించి భగత్‌సింగ్ ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ఆయన భారతదేశానికి స్వాతంత్య్రం తేవడం కోసం వివాహం కూడా చేసుకోలేదు. ఢిల్లీలో ఆయన ఓ పత్రికలో పనిచేసేవారు. ఆయన ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ భావాలను రగిలించేలా పత్రికల్లో రచనలు చేసేవారు.
భగత్‌సింగ్ మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. అందువల్ల ఆయనలో విప్లవ భావాలు మరింత పెరిగాయి. గాంధీ అప్పట్లో వందేమాతరం అని పిలుపు ఇస్తే భగత్‌సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు. ఆయన చేసిన నినాదం ఇప్పటికీ ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. దేశ ప్రజలు ఇప్పటికీ ఆయన నినాదాన్ని మరిచిపోలేదు. నేను టెర్రరిస్టును కానని, విప్లవకారున్నని భగత్ సింగ్ అనేవారు.
జలియన్ వాలాబాగ్ మారుణకాండలో ఎంతో మంది భారతీయులు హతం అవ్వడాన్ని చూసిన భగత్ సింగ్ చలించిపోయాడు. దీంతో బ్రిటిషర్లు కొలువై ఉన్న ఓ అసెంబ్లీ భవనంపై ఆయన బాంబులు వేశారు. తప్పించుకునే అవకాశం ఉన్నా.. ఆయన స్వచ్ఛందంగా లొంగిపోయారు. తరువాత 1939 మార్చి 23వ తేదీన సాయంత్రం సమయంలో భగత్‌సింగ్‌తోపాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. తాను ఉరికంబం ఎక్కడానికి ముందు కూడా స్వాతంత్య్రోదమ భావాలను బ్రిటిషర్లకు చెప్పాడు. ఒక భారతీయ విప్లవకారుడు మహోన్నతమైన లక్ష్యం కోసం ప్రాణాలను అర్పించే పనిచేస్తున్నప్పుడు చూసే భాగ్యం మీకు దక్కిందని బ్రిటిషర్లతో అన్నాడు. తరువాత ఆయన ఉరికంబం ఎక్కి తుది శ్వాస విడిచాడు. భారత స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్ చూపిన తెగువ, ధైర్యం, స్ఫూర్తి నేటికీ ప్రజలకు ఆదర్శనీయమే..!