భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1999 మే, జూన్, జూలై నెలల్లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయ కేతనం ఎగుర వేసేందుకు ముఖ్య కారణం.. ఇజ్రాయిలే అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మిత్రదేశంగా ఉంది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1999 మే, జూన్, జూలై నెలల్లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయ కేతనం ఎగుర వేసేందుకు ముఖ్య కారణం.. ఇజ్రాయిలే అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మిత్రదేశంగా ఉంది. అప్పట్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఏమీ లేవు. కానీ ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అప్పట్లో అవలంబించాయి. అందుకే భారత్‌కు ఎప్పుడు కష్టం వచ్చినా.. ఆదుకునే దేశాల జాబితాలో మొదట ఇజ్రాయెల్ ఉంటుంది. ఈ క్రమంలోనే కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ భారత్‌కు స్నేహ హస్తం అందించి.. భారత్ గెలుపుకు బాటలు వేసింది.
పాకిస్థాన్‌తో కార్గిల్‌లో యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్ వద్ద నిజానికి అధునాతన ఆయుధాలు లేవు. దీంతో యుద్ధంలో భారత్ వెనుకడుగు వేయడం ఖాయమని ప్రపంచ దేశాలు భావించాయి. అయితే అనూహ్యంగా ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. భారత్‌కు కావల్సిన అధునాతన ఆయుధాలను ఇజ్రాయెల్ ఆగమేఘాల మీద భారత్‌కు పంపింది. వాటిల్లో అత్యంత అధునాతన తుపాకులు, మెషిన్ గన్లు, నిఘా వ్యవస్థకు చెందిన యంత్రాలు, పరికరాలు, లేజర్ ఆధారిత మిస్సైల్స్, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. దీంతో భారత్‌కు పాకిస్థాన్ స్థావరాలను నేలమట్టం చేయడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఓ వైపు పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు ఇజ్రాయెల్ భారత్‌కు ఆయుధాలను పంపుతూనే ఉంది. దీంతో భారత్ ధాటికి పాక్ నిలబడలేకపోయింది. భారత్ వద్ద ఉన్న ఆయుధ సామగ్రిని చూసి పాక్ సేనలు బెంబేలెత్తిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ కు చెందిన మిరేజ్ 2000 హెచ్ ఫైటర్ జెట్లు పాకిస్థాన్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేశాయి. దీంతో భూభాగంపై ఉన్న భారత సైనికులు చిరుత పులుల్లా కదులుతూ పాక్ ఆక్రమించుకున్న ఒక్కో భారత భూభాగాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో భారత్.. ఇజ్రాయెల్ పంపిన లేజర్ గైడెడ్ బాంబులను కూడా సమర్థవంతంగా పాక్‌పై ప్రయోగించి విజయం సాధించింది. ఇజ్రాయెల్ ఇచ్చిన నిఘా పరికరాలతో భారత ఫైటర్ జెట్లు ఆకాశం నుంచే కింద ఉన్న పాక్ స్థావరాలను తేలిగ్గా గుర్తించి వాటిని క్షణాల్లో నేలమట్టం చేశాయి.
యుద్ధంలో ఇజ్రాయెల్ నుంచి సాయం భారీగా అందడంతో భారత్ ముందడుగు వేసింది. ఓ దశలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత సైనిక శక్తి పట్ల భయం వేసింది. భారత్ పాకిస్థాన్‌పై దాడి చేసి తమ దేశాన్ని మొత్తం ఆక్రమించుకుంటుందని షరీఫ్‌కు ఆందోళన, భయం మొదలయ్యాయి. దీంతో అతను అమెరికా శరణు వేడాడు. అప్పుడు అమెరికాకు క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. దీంతో క్లింటన్ కార్గిల్ యుద్ధంలో తాము తలదూర్చబోమని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఎటూ పాలుపోని స్థితిలో ఓటమిని అంగీకరించడమే ఉత్తమమని భావించిన షరీఫ్ కార్గిల్ నుంచి పాక్ సేనలను వెనక్కి పిలిపించాడు. దీంతో కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచింది. మువ్వన్నెల పతాకాన్ని కార్గిల్ పర్వతాలపై ఎగుర వేసింది. అలా ఇజ్రాయెల్ ఆపద సమయంలో భారత్‌కు స్నేహ హస్తం అందించి చిరకాల మిత్రదేశంగా మారింది. కార్గిల్ యుద్ధంలో భారత్ పొందిన గెలుపుకు చిహ్నంగా ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ రోజు భారత జాతి మొత్తం గర్వించదగిన రోజు..!