ఇరికించేశాడుగా: సాయిరెడ్డి ట్వీట్సే కాదు… బాలయ్య న్యూస్ కూడా ఫాలో అవ్వు లోకేష్!

-

లోకేష్ కి ఇంకా కుర్రతనం పోలేదనేమాట మరోసారి వెలుగులోకి వచ్చింది! దానికి కారణం ఆయన తొందరపాటుతనం అనేది బాలయ్య అభిమానుల మాటగా ఉంది! అందుకు కారణం అయ్యింది కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారం! ఈ విషయంలోనే బాలయ్యకు – లోకేష్ కు మధ్య కమ్యునికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే… అస్తమానం విజయసాయిరెడ్డి ట్వీట్లే కాదు.. అప్పుడప్పుడూ బాలయ్య న్యూస్ లు కూడా చదువు లోకేష్ అని కామెంట్లు చేస్తున్నారు! ఇంతకూ ఆ వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం!

వివరాళ్లోకి వెళ్తే… నెల్లూరు జిల్లా, కావ‌లి నియోజ‌కవ‌ర్గం, ముసునూరు గ్రామంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ విగ్ర‌హం తొలగించిన విషయంపై వైకాపా- టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయాన్ని పెద్దది చేయాలనో లేక తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనో తెలియదు కానీ.. బాలయ్య సినిమాలో చేప్పే డైలాగుల్లాంటివి ఒకటి రెండు వదిలారు చంద్రబాబు! అనంతరం బాలయ్య కూడా కాస్త గట్టిగానే ఫైరయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే కరెక్టుగా స్పందించారు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి!

ఈ విషయంలో బాలయ్యను ఫోన్ లో సంప్రదించిన స్థానిక వైకాపా ఎమ్మెల్యే… విగ్రహం తొలగించడానికి గల కారణాలను సవివరంగా, బాలయ్యకు అర్ధం అయ్యేలా చెప్పడంతో పాటు.. మరో సేఫ్ ఫేల్స్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో బాలయ్య సానుకూలంగా స్పందించి “సరే” అని కమిట్ అయ్యారు! ఆ సంగతి తెలిసో తెలియకో కానీ… పెద్ద పెద్ద డైలాగులు పేల్చిన లోకేష్… అటు బాలయ్యను ఇరకాటంలో పాడేయడంతో పాటు… తనను తాను ఇరకాటంలో పాడేసుకున్నారు!

ఈ విషయామలపై తాజాగా స్పందించిన లోకేష్… విగ్ర‌హం కూల్చివేత వెనుక రాజ‌కీయ కుట్ర దాగి ఉంద‌ని ఆరోపిస్తూ.. బాధితుల్ని అన్ని విధాలుగా అండ‌గా ఉంటామని హామీ ఇచ్చారు! అంతవరకూ బాగనే ఉంది కానీ… అత్యుత్సాహంలో భగంగానో ఏమో తెలియదు కానీ… “అన్న‌గారి విగ్ర‌హాన్ని కూల్చిన చోటే మ‌ళ్లీ ఏర్పాటు అవుతుంది.. ఇది అన్న గారి మ‌న‌వ‌డు ఇస్తున్న మాట” అని లోకేష్ బాంబు పేల్చారు!

ఇప్పుడున్న చోట పెట్టడం వీలుకాదని, అందుకు గల కారణాలను సవివరంగా విన్న అనంతరం.. స్థానికంగా మరో సేఫ్ ప్లేస్ లో పెట్టాలన్న విన్నపానికి బాలయ్య.. అన్నాగారి వారసుడిగా “ఓకే” అంటే… అన్నగారి మనవడిగా ఇప్ప్పుడు తొలగించిన చోటే పెట్టిస్తామని లోకేష్ మాటిచ్చేశాడు! దీంతో… లోకేష్ తన తొందరపాటు టంగ్ స్లిప్ తో బాలయ్యను ఇరికించినట్లా.. తనకు తానే ఇరుకున్నట్లా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news