ఉపాధ్యాయుల దినోత్సవం వెనుక ఉన్న కారణమేమిటో తెలుసా..?

-

పిల్లలకు నడక, మాటలు నేర్పే గురువులు తల్లిదండ్రులైతే.. వారికి విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసేది.. చదువు చెప్పే గురువులు.. సమాజంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తి అంటే.. అది ఉపాధ్యాయ వృత్తి ఒక్కటే.

పిల్లలకు నడక, మాటలు నేర్పే గురువులు తల్లిదండ్రులైతే.. వారికి విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసేది.. చదువు చెప్పే గురువులు.. సమాజంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తి అంటే.. అది ఉపాధ్యాయ వృత్తి ఒక్కటే. ఉపాధ్యాయులకు సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. ఒక పిల్లవాన్ని మంచి వ్యక్తిగా, భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుంది. ఇక ప్రతి అంశానికీ ఒక రోజు ఉన్నట్లుగానే ఉపాధ్యాయులను గౌరవించేందుకు గాను వారి కోసం ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఏటా మనం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. అయితే అసలు ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో, ఈ తేదీనే ఎందుకు నిర్వహిస్తామో, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

what is the reason behind teachers day in india

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఆయనొక గొప్ప ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్పి వారిని గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అలాగే ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. అందుకనే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడూ ఆయనలా ఉండాలనే విషయాన్ని తెలియజేయడం కోసమే ప్రతి ఏటా ఆయన జయంతి రోజున ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

1962లో మొదటి సారిగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పుడు రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన ఉప రాష్ట్రపతిగా ఉండేవారు. రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ తరువాత రాధాకృష్ణన్ భారతదేశానికి రెండో రాష్ట్రపతి అయ్యారు. కాగా ఆయన 1882లో సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుత్తణి ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఆయన ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తరువాత కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) యూనివర్సిటీ, మైసూర్ యూనివర్సిటీలలో లెక్చరర్‌గా పనిచేశారు. అప్పుడే ఆయనంటే విద్యార్థులకు అమితమైన ఇష్టం ఏర్పడింది.

అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ మీద ఉన్న ఇష్టంతో విద్యార్థులంతా కలిసి సెప్టెంబర్ 5వ తేదీన ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని ఆయన్ను అడిగారట. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదట. కానీ అదే తేదీని ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని, ఆ రోజున ఉత్తమ ఉపాధ్యాయులను స్మరించుకోవాలని ఆయన చెప్పారట. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అదీ ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు కారణం..!

Read more RELATED
Recommended to you

Latest news