తెలంగాణ పోరాట చరిత్ర.. అభివృద్ధి ప్రస్థానాన్ని తలచుకుందాం: సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నూతన సచివాలయం వేదికగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి ప్రసంగిస్తున్నారు. ముందుగా కేసీఆర్.. ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. పదో ఏట అడుగుపెడుతున్న తెలంగాణ పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్థానాన్ని తలచుకుందామని అన్నారు.

“ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైంది. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. మలిదశ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు. రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి ప్రయాణం మొదలైంది. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదాం. నేడు పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక్కసారి.. తెలంగాణ పోరాట చరిత్రను.. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని.. రాబోయే వంద ఏళ్ల అభివృద్ధి ప్రణాళిక గురించి తలచుకుందాం.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news