అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటి: హరీశ్‌

-

తెలంగాణ సాధించుకుని విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రోజుకో శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు 9వ విడత హరిత హారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఈ సందర్భంగా పచ్చదనం ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు.

- Advertisement -

తెలంగాణ హరితోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాలలో తెలంగాణ ఒకటి అని తెలిపారు. రాష్ట్రంలో చక్కటి గ్రీన్ కవర్ కూడా ఉందని అన్నారు. గ్రీన్ కవర్‌లో అద్భుతమైన 7.7 శాతం వృద్ధిని చూశామని.. ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైందని కొనియాడారు. ఇప్పటి వరకు 14 వేల 8 వందల 64 నర్సరీలు, 19 వేలం 4 వందల 72 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...