గన్​పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన కేసీఆర్‌

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు.. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి అవతరణ దినోత్సవ వేడుకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు.. తొమ్మిదేళ్లలో ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని.. తెలంగాణలో జరిగిన ప్రగతిని.. దేశానికి తెలంగాణగా ఏ రకంగా మోడల్​గా మారిందో వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

మొదటగా కేసీఆర్ హైదరాబాద్​లోని గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరవీరులను.. వారి త్యాగాలను స్మరించుకున్నారు. కేసీఆర్ వెంట ఉన్న ప్రజాప్రతినిధులు.. అధికారులు.. కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ సచివాలయానికి బయల్దేరారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత కొత్త సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి దశాబ్ది వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రజాప్రతినిధులు.. అధికారులు.. పోలీసులు.. బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news