ఆదర్శ గ్రామాలకు… కేరాఫ్ అడ్రస్.. అవార్డుల పంటకు నిలువెత్తు చిరునామా.. యావత్ భారతావనిలో.. ఒకే ఒక్క తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. పల్లె కన్నీరు పెడుతుందో.. అని పాడుకున్న దుస్థితి నుంచి.. మురిసింది నా పల్లె సీమ… ముస్తాబై మెరిసింది నా పల్లె సీమ… అని సగర్వంగా పాడుకునే వరకు మహాయజ్ఞం సాగిందని తెలిపారు. ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి.. పేరుపేరునా.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్.
ఇవాళ… ప్రతి పల్లెలో డంప్ యార్డు తప్ప.. చెత్త కంపు లేదు… నిరంతర విద్యుత్ తప్ప వేలాడే కరెంట్ తీగ లేదు… కూలిపోయే స్థితి ఉన్న ఖాళీ ఇండ్ల కిరికిరిలేదు… పొంగిపొర్లే మురికికాలువల ముచ్చట లేదు… తవ్వి వదిలేసిన బోరు బావి లేదు… పాడుబడిన గోడల జాడ లేదు… కలుషిత నీటి కలకలం లేదు… సీజనల్ రోగాల చింతలేదు… పచ్చదనానికి కొదవలేదు… పారిశుధ్యంలో సాటిలేదు… రోడ్లశుభ్రతలో పోటీలేదు …నిధులకు కొరత లేదు.. విధులకు ఆటంకం లేదు… పల్లె ప్రజల భాగస్వామ్యంతో తీరుమారిన.. మన ప్రతి ఊరు మెరుగైన జీవనానికి మారుపేరు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆదర్శ గ్రామాలకు… కేరాఫ్ అడ్రస్
అవార్డుల పంటకు నిలువెత్తు చిరునామా
యావత్ భారతావనిలో.. ఒకేఒక్క తెలంగాణపల్లె కన్నీరు పెడుతుందో..
అని పాడుకున్న దుస్థితి నుంచి..మురిసింది నా పల్లె సీమ…
ముస్తాబై మెరిసింది నా పల్లె సీమ…
అని
సగర్వంగా పాడుకునే వరకు సాగిన ఈ మహాయజ్ఞంలో… pic.twitter.com/pwEQHCmAho— KTR (@KTRBRS) June 15, 2023