BRS ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

-

BRS మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు. అయితే, కొద్దిసేపటి తర్వాత BRS మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు ఐటీ అధికారులు. అవసరం ఉన్నప్పుడు విచారణకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఐటీ అధికారులు. ఇక ఈ దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.

కాగా, తెలంగాణలో ఆదాయ శాఖ అధికారుల దాడులు రెండోరోజు కొనసాగుతున్నాయి. సుమారు 70 బృందాలతో స్థిరాస్తి , హోటల్స్ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగిన వారి ఇల్లు , కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలో రెండోరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news