దశాబ్ది ఉత్సవాల వేళ.. తెలంగాణపై మోదీ ప్రశంసల జల్లు

-

తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. నేటితో తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ఇంకోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాష్ట్ర ప్రజలకు విషెస్ తెలియజేశారు.

‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులైన వ్యక్తులను కలిగి ఉంది. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. ఆ రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ అభివృద్ధి, శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందనలు తెలియజేశారు.

‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news