జైలర్ మూవీ సెట్ లో సంబరాలు..అందుకేనా..?

-

గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోవడం లేదు. అందుకే ఒక మంచి విజయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు అందులో భాగంగానే తాజాగా బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఇకపోతే తాజాగా సినిమా షూటింగ్ సెట్లో సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పాలి..ఇక చిత్ర యూనిట్ కూడా తాజాగా గుమ్మడికాయ కొట్టేసింది.

అయితే ఇదంతా జరగడానికి కారణం నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అందుకే నేడు సెట్ లో భారీగా కేక్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర బృందం. జైలర్ సినిమాలో రజనీకాంత్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న ఈ సినిమా అనుకున్నట్టుగానే ఆగస్టు 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక జైలర్ మూవీ షూటింగ్ మొత్తం తాజాగా పూర్తి కావడంతో టీం వ్రాప్ పార్టీని చేసుకుంది.

ఇక ఈ సినిమాకు సంగీతం అనిరుద్ అందిస్తున్నారు. ఇక జైలర్ సినిమాలో మోహన్ రాజ్ నాగబాబు శివరాజ్ కుమార్ జాకీశ్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జైలర్ సినిమాతో పాటు లాల్ సలాం అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ లాల్ సలాం సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. విష్ణు విశాల్ , విక్రాంత్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇందులో మోయిదీన్ పాత్ర రజనీకాంత్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news