ఆ మూడు రాష్ట్రాలకు భారీగా వరాలు ఇచ్చిన నిర్మల…!

-

మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మల… తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు వరాలు ప్రకటించారు. ఈ ప్రోత్సహకాలకు త్వరలో విధి విధానాలను ప్రకటిస్తామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కి మూడు వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. నేషనల్ టేక్ టెక్స్ టైల్ మిషన్ కు ప్రతిపాదనలు తీసుకొస్తామని అన్నారు. ఎగుమతి కంపెనీలకు కొత్త భీమా పథకం తీసుకొస్తామని అన్నారు. సంపద సృష్టిపై దృష్టి పెడతామని అన్నారు. ఎగుమతుల ఉత్పత్తులపై కొత్తగా పన్నులు తీసుకొస్తామని చెప్పారు.

ప్రతీ జిల్లాను ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు, ఇన్ ఫ్రా రంగానికి వచ్చే అయిదేళ్ళకు వంద లక్షల కోట్లు కేటాయిస్తామని అన్నారు. సముద్ర వాణిజ్యం ఇంకా పెరగాలని అన్నారు. ఎగుమతుల రుణాల పంపిణీకి నిర్విక్ పథకం ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించారు. పరిశ్రమ, కామర్స్ కు 27,300 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. త్వరలో చెన్నై బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే ఏర్పాటు చేస్తామని అన్నారు. 2023 నాటికి ముంబై-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే పూర్తి చేస్తామని అన్నారు.

వ్యాపారం ఔత్సాహిక పారిశ్రామిక లక్షణం మన జీన్స్ లోనే ఉందన్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహకం అందిస్తామని అన్నారు. 9 వేల కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబై అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ ట్రైన్ ఏర్పాటు చేస్తామన్నారు. రెండు వేల కిలోమీటర్ల మేర స్ట్రాటజిక్ హైవేలు నిర్మిస్తామని అన్నారు. త్వరలో జాతీయ లాజిస్టిక్స్ విధానం తీసుకొస్తామని అన్నారు. పోర్ట్ లను కలుపుతూ రెండు వేల కిలోమీటర్ల తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.

పీపీపీ పద్దతిలో 15౦ రైళ్ళు తీసుకొస్తామని చెప్పారు. బెంగళూరు రైల్ ప్రాజెక్ట్ కి 18,400 కోట్లు కేటాయించారు. 11 వేల కిలోమీటర్ల విద్యుత్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్ రంగానికి 22 వేల కోట్లు కేటాయించారు. పీపీపీ పద్దతిలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. వచ్చే మూడేళ్ళలో దేశం అంతట ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరెంట్ మీటర్లకు రాష్ట్రాలకు సూచనలు ఇస్తామని చెప్పారు. విద్యుత్ చోరీకి ఇలాగే అడ్డుకట్ట వేస్తామని అన్నారు. 2024 నాటికి వంద విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news