మోదీ సర్కార్ ఆ నాలుగు కులాలకే ప్రాధాన్యమిచ్చింది : నిర్మలా సీతారామన్

-

మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు కులాలకు ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసే ప్రయత్నం చేసిందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు బహుముఖి అయిన విధానాలతో ఈ ప్రభుత్వం పని చేసిందని వెల్లడించారు. రూ.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా అందించిందని వివరించారు.

“కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదింది. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించింది. సమాజంలోని అన్ని వర్గాలు.. కుల, మత, ఆర్థిక బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. 2047 నాటికి అసమానత, పేదరికం అనేది కనబడకుండా చేయాలన్నదే లక్ష్యం. ఈ ప్రభుత్వం ఆచరణీయమైన సెక్యులరిజం, అవినీతి నిర్మూలన, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది. 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికసాయం అందించాం. 4.5 కోట్లమందికి బీమా సౌకర్యం కల్పించాం. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత తీసుకొచ్చి విలువ జోడింపు ద్వారా కొత్త విధానాలు తీసుకువచ్చాం.” అని నిర్మలా సీతారామన తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news