కేంద్ర బడ్జెట్ 2024-25కు రాష్ట్రపతి అనుమతి

-

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఈ మధ్యంతర పద్దును తీసుకువస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించనున్నారు. 

ఈ నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ ప్రతులను అధికారులు పార్లమెంట్కు తీసుకువచ్చారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహా పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంట్కు చేరుకున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి తీసుకున్నారు. మధ్యంతర పద్దు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఈ పద్దును ప్రవేశ పెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news