ఈడీ సమన్లపై హైకోర్టులో హేమంత్ సోరెన్ రిట్ పిటిషన్

-

ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా( జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం సోరెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకు ముందే సీఎం పదవికి సోరెన్‌ రాజీనామా చేశారు. విచారణ అనంతరం ఆయణ్ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అయితే ఈడీ సమన్లపై హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఝార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ అనుభా రావత్ చౌదరిలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఆయన స్థానంలో జేఎంఎం సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తొలుత సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చినా.. దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడం వల్ల చివరకు పార్టీ సీనియర్‌ నేత చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news