రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, నిర్మల వరాలు…!

-

కేంద్ర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ రైతులకు వ్రాలు ప్రకటించారు. వ్యవసాయానికి సంబంధించి 3 కొత్త చట్టాలు తీసుకొస్తామని అన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ కి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. విమానాల ద్వారా రైతుల పంట రవాణాకు కృషి ఉడాన్ స్కీం ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటన. ఆర్గానికి ఫార్మింగ్ మార్కెట్ కు జాతీయ స్థాయిలో స్కీం ప్రవేశ పెడతామని అన్నారు. రైళ్ళ ద్వారా పంటల రవాణాకు కిసాన్ రైలు స్కీం ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించిన నిర్మల కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం కోసం 15 లక్షల కోట్లు కేటాయిస్తామని చెప్పారు.

భారత రైల్వేల ఆధ్వర్యంలో కిసాన్ రైలు కార్యక్రమం నడుస్తుందని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు ధాన్య లక్ష్మి రుణాలు ఇస్తామని ప్రకటించారు. మరింత విస్తృతంగా నాబార్డ్ స్కీం ని ఫైనాన్స్ స్కీం ఉంటుందని చెప్పారు. 2021 కల్లా 108 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తే తమ లక్ష్యమని అన్నారు. వ్యవసాయ రంగం నీటి పారుధలా, గ్రామిణాభివ్రుద్దికి కలిపి 2.83 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ౦ ఆదాయం పెరుగుతుందని అన్నారు.

సాగర మిత్ర ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. చేపలు పట్టడంలో యువతకు శిక్ష ఇస్తామని అన్నారు. చేపల ఉత్పత్తిని 2 లక్షల టన్నులకు పెంచడమే ఉద్దేశమని అన్నారు. కూరగాయలు పండ్ల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు కేటాయిస్తామని అన్నారు. గ్రామీణ స్టోరేజ్ స్కీం పేరుతో కొత్త పథకం ప్రవేశ పెడతామని అన్నారు. వేర్ హౌస్ నిర్మాణాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. 2022-23 నాటికి మత్స్య ఉత్పత్తి టార్గెట్ 200 లక్షల తన్నులు అన్నారు, మత్య్స ఉత్పత్తి రంగంలో గ్రామీణ యువతకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.వ్యవసాయం మరింత పోటాపోటీగా సాగాలి అన్నారు. రాష్ట్రాలకు మూడు కొత్త అగ్రీ చట్టాలు ఇస్తామన్నారు. జల జీవన్ మిషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news