ఏపీ, తెలంగాణలు పెట్రో ధరలను తగ్గించలేదు.. లోక్‌సభలో నిర్మలమ్మ

-

సామాన్యుడిపై భారం తగ్గించడానికి కేంద్రం పన్నులు తగ్గించిన ప్రతిసారీ అన్ని రాష్ట్రాలూ తగ్గిస్తాయని తాము అంచనా వేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించిన తర్వాత కూడా ఆరు రాష్ట్రాలు ఎలాంటి పన్నులనూ తగ్గించలేదని తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆమె ఈ విషయం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, కేరళ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్‌పై ఇప్పటివరకూ పన్నులు తగ్గించలేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు పంజాబ్‌ ఈ నెలలో ఈ రెండు ఉత్పత్తులపైనా వ్యాట్‌ పెంచిందని గుర్తు చేశారు. దీనివల్ల అక్కడ ప్రతిలీటర్‌పై 90 పైసల భారం పెరిగిందన్నారు. కేరళ కూడా సామాజిక భద్రత సుంకం పేరుతో లీటర్‌పై రూ.2 భారం వేసిందన్నారు. మరోవైపు కేంద్రం స్పందించిన తర్వాత భాజపా పాలిత రాష్ట్రాలన్నీ వాటి పరిధిలో పన్నులను తగ్గించాయని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news