ఇకపై గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు – సీఎం జగన్

-

ఇకపై గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం జగన్. వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్…2022 అక్టోబరు – డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు రూ. 38.18 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

 

అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…అక్టోబరు- డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల పాటు సమయం ఇచ్చాం…ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తి చేసి, ఇవాళ నేరుగా వారికి నగదు జమ చేస్తున్నామన్నారు.ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు.

 

జనవరి- ఫిబ్రవరి- మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తాం..మేలో వారికి మంచి చేస్తాం..ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం అన్నారు. పేదవాడి తలరాత మారాలంటే.. చదువు అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తల రాతలు మారుతాయి…దీన్ని గట్టిగా నమ్ముతున్న ప్రభుత్వం మనదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news