ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ ఐంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది.

ఇది విషయాన్నీ గత నెలలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కాగా మంగళవారం మరో రూ.5 వేల కోట్ల అప్పు చేయనుంది. వచ్చే మంగళవారం రూ.5 వేల కోట్లు అప్పు కోసం ఆర్బీఐ వద్ద ఇండెంట్ పెట్టింది కూటమి ప్రభుత్వం. దీంతో కలుపుకొని 14 నెలల పాలనలోనే రూ. 1,91,361 కోట్ల అప్పు చేయనుంది. రికార్డ్ స్థాయిలో అప్పు చేసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.