చాణక్య నీతి: వీరికి అప్పుగా డబ్బును ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే..!

-

ఆర్థిక అవసరాల కోసం అప్పును తీసుకోవడం మరియు అప్పును ఇవ్వడం సహజమే. అయితే ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం లో ఎన్నో మంచి విషయాలను చెప్పడం జరిగింది. బంధాలు, కుటుంబ సమస్యలు, స్నేహం మరియు జీవిత అనుభవాల గురించి మాత్రమే కాకుండా, ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి విధంగా వ్యవహరించాలి అనే అంశం పై కూడా వివరించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమందికి అప్పు ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. డబ్బు అవసరం ఉన్నప్పుడు ఎవరైనా అప్పు అడిగితే, వారిని నమ్మి డబ్బులను ఇస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అప్పు అస్సలు ఇవ్వకూడదు.

మద్యానికి బానిసైన వ్యక్తులకు లేదా మద్యం మత్తులో ఉండే వ్యక్తులకు అప్పు ను అస్సలు ఇవ్వకూడదు అని ఆచార్య చాణక్యుడు చెప్పడం జరిగింది. వీరు డబ్బును అప్పుగా తీసుకుని దుర్వినియోగం చేస్తాఋ మరియు మంచి చెడుల విషయాల గురించి అసలు ఆలోచించఋ అని తెలిపారు. ఎవరైతే జీవితంలో అసంతృప్తిగా మరియు ఎటువంటి సంతోషం లేకుండా ఉంటారో, వారు అప్పు అడిగినప్పుడు అసలు ఇవ్వకూడదు. అలాగే ఎవరైతే చెడు వ్యక్తిత్వం కలిగి ఉంటారో, వారికి అసలు డబ్బులు ఇవ్వకూడదు.

సరైన వ్యక్తిత్వం లేని వారు అనైతిక కార్యకలాపాలలో పాల్గొంటారు. దానివల్ల డబ్బు వృధా అవుతుంది. కనుక అటువంటి వారికి ఎటువంటి పరిస్థితులలో డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు. మూర్ఖులు లేదా బాధ్యతారహిత వ్యక్తులకు డబ్బులను అస్సలు ఇవ్వకూడదని ఆచార్య చాణిక్యుడు చెప్పాడు. డబ్బు అవసరం ఉన్నవారికి సహాయం చేయడం సరైనది. కానీ ఇటువంటి వ్యక్తులకు డబ్బులను అస్సలు అప్పుగా ఇవ్వకూడదు. కాబట్టి, ఎప్పుడైనా ఆర్థిక అవసరం కోసం ఎవరైనా అప్పు అడిగితే ఆలోచించి మాత్రమే అప్పుగా డబ్బును ఇవ్వాలి అని ఆచార్య చాణక్యుడు చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news