అసూయ ద్వేషాలను విడనాడదాం

-

అదేంటో.. ప్రతీ వ్యక్తికీ తాను తప్ప చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమస్త మానవాళీ అసమర్థులే! అలాంటి సమాజంలో ప్రక్క వ్యక్తి చేత మెప్పుదలని పొందడం కోసం మనం పడే ఆరాటం, ప్రక్క వ్యక్తి మనల్ని ఉన్నతులుగా ఒప్పుకోలేక పైపైన ప్రదర్శించే నాటకీయ మెచ్చుకోళ్లు, అవి మనసులోతుల నుండి వచ్చిన ప్రశంసలు కావని తెలిసినా, ‘వాడంతే ఒట్టి అసూయాపరుడు’ అని మనల్ని మనం సముదాయించుకుని మరోచోట అహాన్ని సంతృప్తిపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు.. ఎంత దుస్థితిలో కూరుకుపోయాం. ఓ

చిన్న సంఘటన ఆధారంగా మనుషులు మనపై ఏర్పరుచుకున్న అభిప్రాయాలు జీవితాంతం వారి చేష్టల్లో కొట్టొచ్చినట్లు కన్పించినప్పుడల్లా ‘అయ్యో నేను అలా కాదు.. ఇలా కదా! ఎందుకు వారు అలా అనుకుంటున్నారు’ అని మనసు మూలుగుతుంది.

అంత అవసరం ఏమొచ్చింది? మనకు మనం అర్థమవడానికే ఈ జీవితం సరిపోదు. అలాంటిది మనల్ని ఎదుటివారు అర్థం చేసుకున్నామనుకోవడమూ, ఓ ముద్ర తగిలించేయడమూ, దాన్ని మనం ఒప్పుకోలేక మూలగడమూ అవసరమా? అవతలి వ్యక్తికి మనల్ని చూసి ఏదో ఒక ముద్ర అది మంచిదో, చెడ్డదో త్వరగా వేసుకోకపోతే వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికి, వారి పాత్రలను పోషించడానికీ సమయం సరిపోవద్దూ! జీవితపు ఏ దశలో అయితే సామాజికగౌరవాలపై వ్యామోహం తగ్గుతుందో అప్పుడే ఈ నాటకానికీ, నటనలకూ తెరపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news