సాధారణంగా వేసవికాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి.అయితే ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు అధికంగా పెరిగాయి. పదిహేను రోజుల క్రితం వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ: 180 ఉండగా ఈ ఆదివారం నాడు రూ: 260 రూపాయలకు చేరింది.కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో కోళ్ల ధరలు కొండెక్కాయి.
ఇప్పటికే నిత్యావసర సరుకులు, వంటనూనెల ధరలు అందనంత దూరంలో ఉండడం, కోళ్లు గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది.వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజాంబాద్, నుండి ప్రాంతాల నుండి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే తెలంగాణలో కేజీ చికెన్ ధరలు.. విత్ స్కిన్ పర్ కేజీ 235 రూ.. స్కిన్ లెస్ పర్ కేజీ 260 రూ.. కోడిగుడ్లు డజన్ కు 50 రూ.. ఉంది.. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చికెన్ ధరలు మండి పోతున్నాయి. దీంతో ముక్క అలవాటు పడ్డవారు సైతం వెనక్కి తగ్గుతున్నారు.
గమనిక: పలు రిటైల్ దుకాణాలలో ధరలో కొంత మేరకు హెచ్చు తగ్గులు ఉండవచ్చు