భయం నుండి బయట పడాలంటే ఇలా చేయండి…!

-

సాధారణంగా మనకి కొన్ని కొన్ని విషయాల్లో భయం ఉంటుంది. దేనినైనా చూసి భయపడటం లేదా ఏదైనా సన్నివేశాన్ని తలుచుకుని భయ పడడం జరుగుతుంది. అయితే భయం నుంచి బయట పడాలంటే ఏం చేయాలి..? అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఒక లుక్ వేసేయండి.

మీ భయాలని ఫేస్ చేయడం :

ఎప్పుడైతే మీరు మీ భయాలతో ఫేస్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. పైగా మీరు మరింత తెలివిగా వీటిని డిల్ చేయగలరు. ఎప్పుడూ ఏదో ఒకటి ఎదురవుతుంది, మీరు దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. దానికి ఎదురు వెళ్లి సవాల్ గా స్వీకరించండి ఇలా చేయడం వల్ల మీరు మరో సారి భయపడకుండా దానిని సులువుగా ఫేస్ చేయడానికి వీలవుతుంది.

మరింత భయంకరంగా ఊహించుకోండి:

మీకు ఒక భయంకరమైన ఆలోచన వస్తే దాని కంటే భయంకరంగా ఉండే దానిని మీరు ఈ ఇమాజిన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది.

సమయం తీసుకోండి:

వెంటనే ఆలోచించడం మంచిది కాదు. సమయం తీసుకుని నెమ్మదిగా దానిని మీరు ఎదుర్కొనడానికి ఆలోచించండి.

ఇతరులతో చర్చించండి:

మీ భయాలు కోసం, మీకు ఎదురయ్యే సందర్భాల కోసం మీరు ఎవరితోనైనా మాట్లాడండి. ఇలా మాట్లాడడం వల్ల మీకు భయం పోతుంది. తర్వాత అది మీకు ఎదురైనప్పుడు మీరు దానిని ఎంతో ఈజీగా హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది కూడా.

Read more RELATED
Recommended to you

Latest news